సినిమా ప్రమోషన్ కోసం భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వాడుకుంటున్న సమంత  

సినిమా ప్రమోషన్ కోసం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని వాడుకుంటున్న సమంత.

Samantha Used India And Pakistan Match For O Baby Movie Promotion-samantha Used India And Pakistan Match,tollywood,world Cup 2019

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి సమంత. అక్కినేని ఇంటి కోడలిగా వచ్చి టాలీవుడ్ కోడలుగా మారిపోయిన సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పుడు సమంత ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవకాశం వాడుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..

సినిమా ప్రమోషన్ కోసం భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వాడుకుంటున్న సమంత-Samantha Used India And Pakistan Match For O Baby Movie Promotion

భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఓ రకమైన భావోద్వేగాలతో కూడుకొన్నది. ఇలాంటి మ్యాచ్ లో సినిమా ప్రమోషన్ అంటే ఎంత మందికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే సమంత ఈ క్రికెట్ మ్యాచ్ కి తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటుంది.

స్టార్ మా ఛానల్ తెలుగులో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో సమంత కూడా కనిపించబోతుంది. ఇదంతా సమంత తన లేటెస్ట్ మూవీ ఓ బేబీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చేయడం విశేషం. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ తో పాటు సాయంత్రం ట్విట్టర్ లైవ్ చాట్ లో తన అభిమానులతో సమంత ముచ్చటిస్తుంది.

ఈ చాటింగ్లో సంబంధిత పాటు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ కూడా పాల్గొనబోతున్నాడు. మొత్తానికి ఈరోజు తెలుగులో స్టార్ మా స్పోర్ట్స్ ఛానల్ చూసేవారికి ఇండో-పాకిస్తాన్ మ్యాచ్లో మధ్యలో సమంత సందడి కూడా కనిపించింది. దీనికి కారణం ఓ బేబీ సినిమా ప్రమోషన్ స్టడీ లో భాగమే అని తెలుస్తుంది.