వంటలతో సందడి చేస్తున్న సమంత, ఉపాసన… అసలు విషయం ఏమిటంటే…?!  

samantha upasana making dishes the real thing is samnatha, upasana, brown rice, lockdown, your life.com - Telugu Brown Rice, Lockdown, Samnatha, Upasana, Your Life.com

భారతదేశంలో రాజకీయ నేతల కన్న సినిమా యాక్టర్స్ కు, క్రికెటర్స్ కు తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇది కేవలం భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.

TeluguStop.com - Samantha Upasana Making Dishes The Real Thing Is

ఏ రాష్ట్రం తీసుకున్న ఇలానే ఉంది పరిస్థితి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయాల్లో కూడా అనేకమంది సినిమా స్టార్స్ ను తెగ ఫాలో అయిపోతున్నారు.

అయితే సినిమా స్టార్స్ కూడా కొందరు సామాజిక సేవలో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకున్న వారు ఎందరో.ఈ కోవకే చెందిన వ్యక్తులలో మెగాస్టార్ కోడలు ఉపాసన కూడా ఒకటి.

TeluguStop.com - వంటలతో సందడి చేస్తున్న సమంత, ఉపాసన… అసలు విషయం ఏమిటంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈవిడ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి అనేకమందికి సహాయం చేస్తుంది.అంతేకాదు మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు తెచ్చుకుంది.

ఇక అలాగే అక్కినేని కోడలు సమంతా కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూనే ఉంటుంది.అంతేకాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి నటిగా సమంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత నాగచైతన్య ను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలు స్థిరపడిపోయింది.

ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా సమంత ఉపాసన కలిసి ఆరోగ్యమైన జీవనశైలిని అందించడానికి అని ‘ యువర్ లైఫ్ డాట్ కాం , అనే వెబ్సైట్ ను మొదలు పెట్టేశారు.

ఇక ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సూత్రాలతో కూడిన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే వాటిపై వీరిద్దరూ అవగాహన కల్పిస్తున్నారు.

ఇకపోతే ఈ వెబ్సైట్ కు సంబంధించి అక్కినేని సమంత గెస్ట్ ఎడిటర్ గా పని చేస్తున్నట్లు ఉపాసన తెలియజేసింది.ఇక తాజాగా సమంత బ్రౌన్ రైస్ తో టమాటా రైస్ ఎలా తయారు చేయాలో వివరించింది.

ఈ కార్యక్రమంలో సమంత ఉపాసన ఇద్దరు పాల్గొన్నారు.ఇందులో సమంతా ప్రతిరోజు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇకపోతే ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వీరిద్దరు ఎక్కువగా తమిళ భాషలోనే మాట్లాడు కోవడం విశేషం.ఇక లాక్ డౌన్ సమయంలో సమంత అక్కినేని షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉండి సొంతంగా వ్యవసాయం చేసి కూరగాయల సాగు చేసిన విషయం అందరికీ విధితమే.

#Lockdown #Your Life.com #Upasana #Samnatha #Brown Rice

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Upasana Making Dishes The Real Thing Is Related Telugu News,Photos/Pics,Images..