లాస్ట్ ఇయర్ చివర్లో యశోద(Yashoda) తో అలరించిన సమంత తన నెక్స్ట్ సినిమా శాకుంతలం(Shakuntalam)తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విషయంలో సమంత(Samantha) చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా మేకర్స్ సినిమా రిలీజ్ జాప్యం చేయడం ఆమెని నిరుత్సాహపరుస్తుంది.
ఫిబ్రవరి 17న అనుకున్న శాకుంతలం వాయిదా వేశారు.రీసెంట్ గా ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ అని చెప్పారు.
కానీ ఆ టైం కి కూడా వస్తుందా రాదా అన్నది డౌట్ అని అంటున్నారు.
సినిమా రిలీజ్ కి కేవలం నెల మాత్రమే ఉండగా పాన్ ఇండియా రిలీజ్(Pan india) చేయాలనుకున్న సినిమా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేయాలి కానీ శాకుంతలం టీం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టలేదు.
అంతేకాదు సమంతతో డైరెక్ట్ గా ప్రమోషన్స్ కూడా చేసే ఆలోచనలో లేదు.సమంత ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా మీడియా ముందుకు రావాలని అనుకుంటుందట.
శాకుంతలం టీం ఈ కన్ ఫ్యూజన్ తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం లేట్ చేస్తున్నారు.మరి సమంత కొద్దిగా ముందుకొచ్చి శాకుంతలం రిలీజ్ దాకా సపోర్ట్ చేస్తే బెటర్ అని అంటున్నారు.