బాలీవుడ్ కలలు కంటున్న సమంత! ఓ బేబీతో తీర్చుకునే ప్రయత్నం  

ఓ బేబీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సమంత. .

Samantha Try To Launch In Bollywood With Oh Baby Movie-

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అంతకంటే ముందుగా తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక చైతూకి జోడీగా నటించిన ఏమాయ చేసావే సినిమా సూపర్ హిట్ తో మళ్ళీ సమంత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకొని సౌత్ లో స్టార్ హీరోయిన్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంది...

Samantha Try To Launch In Bollywood With Oh Baby Movie--Samantha Try To Launch In Bollywood With Oh Baby Movie-

ఇక ఈ మధ్య కాలంలో చైతుని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలిగా మారిన తర్వాత వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంటుంది.అయితే సౌత్ లో ఎంత స్టార్ హీరోయిన్ ఫేం తెచ్చుకున్న ఇప్పటి వరకు బాలీవుడ్ లో సమంత అవకాశాలు అందుకోలేదుతాజాగా కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ని ఏరి కోరి తెచ్చుకొని తెలుగులో రీమేక్ చేసింది.ఇక ఆమె అంచనాలు అందుకొని ఓ బేబీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఎప్పటి నుంచో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతున్న సమంత దానికి ఓ బేబీ సినిమాని మంచి ఫ్లాట్ ఫాంగా చేసుకొని గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది.అయితే ఈ సినిమా కోసం రానా మాత్రం సమంత కాకుండా కంగనా, అలియా భట్ లని ఆప్షన్ గా అనుకుంటున్నారు.

Samantha Try To Launch In Bollywood With Oh Baby Movie--Samantha Try To Launch In Bollywood With Oh Baby Movie-

సమంత మాత్రం కచ్చితంగా ఓ బేబీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది.మరి సమంత కోరికని రానా ఎంత వరకు తీరుస్తాడో అనేది వేచి చూడాలి.