రూమర్స్ కొట్టిపడేసిన సమంత

తెలుగు, తమిళ భాషల్లో అందరు అగ్ర హీరోలను కవర్ చేస్తూ నిత్యం బిజీ బిజీగా ఉండే తార సమంత .ఇటు నటన మాత్రమె కాకుండా , పలు సేవా కార్యక్రమాల్లో కుడా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ .

 Samantha Trashes Rumors-TeluguStop.com

ఈ మధ్య సమంత మీద ఓ గాలివార్త ప్రచారంలోకి వచ్చింది.

అదేంటంటే .తమిళ హీరో సూర్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న 24 చిత్రం యొక్క తెలుగు హక్కులు సమంత తీసుకుంటున్నట్లు గాలి వార్తలు చక్కర్లు కొట్టాయి .హీరోయిన్ గా బాగానే సంపాదిస్తోంది కదా .మళ్ళి లేని పెంట ఎందుకు సమంత కు అని ముక్కున వేలేసుకున్నరంతా .అయితే ఇదంతా ఉత్తిదే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేసింది సమంత.

తనకి షూటింగ్స్ తోనే టైం అంతా గడిచిపోతోందని, డేట్స్ అడ్జస్ట్ అవక, చాలా సినిమాలు వదిలేసుకుంటుంటే … టైం పాస్ కోసం మీడియా వారు రాసుకున్న గాలివార్తలే ఇవన్ని అని రుమార్స్ ని ఖండించింది సమంత.అయినా సినిమా వ్యాపారం చేసుకునేంత ఖాలిగా లేదుగా సమంత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube