కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సమంత

చిత్ర పరిశ్రమలో చాలా కాలం నుంచి కాస్టింగ్ కౌచ్ భాగోతం నడుస్తూ ఉంది.మీటూ ఉద్యమంలో భాగంగా చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్నారు.

 Samantha Open Up On Casting Couch, Tollywood, Telugu Cinema, South Cinema,, Meto-TeluguStop.com

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇప్పటికే చాలా మంది భామలు లైంగిక వేధింపుల గురించి పలు సందర్భాలలో బయటకి వచ్చి తెలియజేశారు.ఇండస్ట్రీలో తమకి ఎదురైనా అనుభవాలని పంచుకున్నారు.

ఈ నేపధ్యంలో సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, హీరోలకి లొంగిపోతేనే అవకాశాలు వస్తాయనే అభిప్రాయం బలంగా ఉంది.అయితే ఇలాంటి అనుభవాలు అందరి హీరోయిన్స్ కి ఉండవనే విషయాన్ని అప్పుడప్పుడు కొంత మంది భామలు చెబుతున్నారు.

తాజాగా సమంత కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.ఇండస్ట్రీలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇద్దరూ ఉన్నారు.నాకు ఎంతో మంది మంచి వాళ్ళు మాత్రమే ఎదురయ్యారు కానీ చెడ్డవాళ్ళు ఎదురుకాలేదు.సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.

ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాలలోను ఆడవాళ్ళపై వేధింపులు అనేవి ఉంటాయి.అయితే వాటికీ మనం లొంగిపోతే అలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి.

అయితే నేను మాత్రం క్యాస్టింగ్ కౌచ్ భారిన ఎప్పుడూ పడలేదు.ఎవరూ నా ముందు వేరే ఉద్దేశ్యంతో మాట్లాడిన సందర్భాలు కూడా పెద్దగా లేవని చెప్పింది.

మొత్తానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తరహాలోనే సమంత కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అయితే నాకు అలాంటి అనుభవం లేదని చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube