నాగార్జునకు సమంత మనవరాలు కాబోతుందా.. ఇండస్ట్రీలో ఆసక్తికర టాక్‌  

Samantha To Play Nagarjuna Granddaughter Role-naga Chaitanya,nagarjuna,nagarjuna Granddaughter Role,oh Baby Movie,samantha,నాగార్జున,సమంత

అక్కినేని ఫ్యామిలీ సినిమా మరోటి రాబోతుంది. మనం చిత్రం తర్వాత నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న బంగార్రాజు చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది..

నాగార్జునకు సమంత మనవరాలు కాబోతుందా.. ఇండస్ట్రీలో ఆసక్తికర టాక్‌ -Samantha To Play Nagarjuna Granddaughter Role

నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ చిత్రంను ముగించే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ 3 కి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. బిగ్‌బాస్‌ చేస్తున్న సమయంలోనే బంగార్రాజు చిత్రంను మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది.

బంగార్రాజును వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఆరాటపడుతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఇప్పటికే రమ్యకృష్ణ ఓకే అయ్యింది.

ఇక ఈ చిత్రంలో నాగార్జునకు మనవడి పాత్రలో ఆయన తనయుడు నాగచైతన్య కనిపించబోతున్నాడు. నాగచైతన్యకు జోడీగా సమంత అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మనం సెంటిమెంట్‌ కలిసి రావడంతో పాటు భార్య భర్తలు కలిసి నటిస్తే ఫలితం ఎలా ఉంటుందో మజిలీ ద్వారా వెళ్లడయ్యింది.

అందుకే మరోసారి సమంతను చైతూకు జోడీగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నాగార్జున కోరితే సమంత ఎట్టి పరిస్థితుల్లో కాదనదు. అందుకే ఈ చిత్రం కోసం స్వయంగా నాగార్జున తన మనవరాలి పాత్రను చేయాల్సిందిగా సమంతను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ సమంత కనుక ఈ చిత్రంలో ఉంటే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.