ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసిన సామ్.. ఆనందంతో ఇలా..!

సమంత విడాకుల విషయం ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నాగ చైతన్య, సమంత జంట విడిపోతున్నారనే వార్త తెలిసి టాలీవుడ్ అంత షాక్ అయ్యింది.

 Samantha To Play A Bisexual Tamil Woman In First Foreign Film Arrangements Of Lo-TeluguStop.com

ఇక సమంత విడాకుల తర్వాత మానసికంగా దృడంగా మారడమే కాకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది.చైతూతో విడిపోయిన తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.

Telugu Love, Philip John, Samantha, Samantharuth-Movie

పెళ్ళికి ముందు ఎలాగైతే వరుస కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసేదో ఇప్పుడు విడాకుల తర్వాత మళ్ళీ పాత రూట్ లోనే కనిపించ డానికి రెడీ అవుతుంది.ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది.ఈ విషయం తెలిసి అభిమానులంతా సంతోష పడితే తోటి హీరోయిన్స్ షాక్ అవుతున్నారు.

ఇక మరొక బడా ఆఫర్ పట్టేసింది సామ్.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేక పోయారు.ఇక సామ్ అలాంటి అవకాశాన్ని అందుకుని చూపించింది.

తాజాగా సామ్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.సామ్ మొదటిసారి ఇంటర్నేషనల్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

ఈ విషయాన్నీ సామ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

Telugu Love, Philip John, Samantha, Samantharuth-Movie

అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‘ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించ బోతున్నారు.ఇక ఈ సినిమాలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుందట.

ఇక ఈ సినిమా మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.సామ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఈ పాత్ర నాకు ఛాలెంజిన్గ్ గా ఉందని తెలిపింది.

ఇక సమంత ప్లాన్ చూస్తే మాత్రం అందరికి మైండ్ బ్లాంక్ అవుతుంది.మహిళలు ఇలా స్ట్రాంగ్ గా నిలబడాలని మరికొంత మంది సమంతను పొగుడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube