సమంతని మెప్పించిన కథ.. త్వరలోనే షూటింగ్?

అక్కినేని కోడలు సమంత పెళ్లయిన తర్వాత కూడా ఏమాత్రం సినిమా అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.

 Samantha To Kickstart A New Movie-TeluguStop.com

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సమంత కొన్ని రోజులపాటు ఎలాంటి సినిమాలను ఒప్పుకోకుండా తన స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు.ది ఫ్యామిలీ మెన్ సిరి ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంతకు బాలీవుడ్ అవకాశాలు రావడంతో ముంబై లో ఇల్లు కొనిందని,త్వరలోనే అక్కడికి షిఫ్ట్ కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే అభిమానులు ఇకపై సమంత తెలుగు సినిమాలు చేయదా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్న సమయంలో సమంత ఊహించని విధంగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.కొత్త కుర్రాడు వినిపించిన కథ సమంతకు ఎంతో నచ్చిందని, ఇలాంటి కథతో ఇప్పటివరకు ఏ భాషలో సినిమాలు రానందున ఆమె కథ విన్న వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.

 Samantha To Kickstart A New Movie-సమంతని మెప్పించిన కథ.. త్వరలోనే షూటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Telugu Krishna Prasad‌, Mumbai, New Director, New Movie, Samantha, Sridevi Movie Banner, Tollywood-Movie

ఇకపోతే సమంత ఒప్పుకున్న ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రం అని తెలుస్తోంది.ఈ సినిమాను శ్రీదేవి మూవీ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు.గతంలో ఈయన నిర్మించిన ఆదిత్య369 ఇండస్ట్రీ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అలాగే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తూ కృష్ణ ప్రసాద్ నిర్మించిన జెంటిల్మెన్, సమ్మోహనం వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.మరి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఈ సినిమా ఈ నిర్మాతకు ఏవిధమైనటువంటి విజయాన్ని అందిస్తుందో వేచిచూడాలి.

#Sridevi #Krishna Prasad #Mumbai #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు