సమంత అభిమానులకు షాకింగ్ న్యూస్

ఏ మాయ చేసావే సినిమా అనగానే మనకు సమంత పోషించిన జెస్సి పాత్రతో పాటు, జెస్సి మాటలు, జెస్సి గొంతు గుర్తుకువస్తాయి.అంతలా మన మెదళ్లలో స్థిరపడిపోయింది ఆ గొంతు.

 Samantha To Dub Herself ?-TeluguStop.com

ఇక సమంతకు డబ్బింగ్ చెప్పింది గాయని చిన్మయి అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.అప్పటినుంచి దాదపు ప్రతి సినిమాలో సమంత కు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.

అది సమంత గొంతే అని మనం కూడా ఫిక్స్ అయిపోయాం.మరి అంతలా అలవాటు పడ్డాక, ఇక చిన్మయి గొంతు అక్కరలేదు అంటోంది సమంత.

ఏంటి ఈ షాకింగ్ న్యూస్ అనుకుంటున్నారా!

సమంత ఇకపై సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలి అనుకుంటుందట.మొన్న రిలీజ్ అయిన తమిళ సినిమా, 10-ఎన్ద్రాతుకుల్లా లో సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోని మెప్పించింది.తెలుగు అనర్గళంగా మాట్లాడే సమంతాను “అ.ఆ” కోసం సొంతంగా డబ్బంగ్ చెప్పమని దర్శకుడు త్రివిక్రమ్ సూచించారట.దానికి సమంత కూడా ఒకే అంది అని సమాచారం.నిజానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి సమంత సొంతగా డబ్బింగ్ చెబుదామని అనుకున్నా, అప్పుడు కుదర్లేదు.కాస్త ఆలస్యమైనా, ఇకపై అన్నీ సినిమాలకి సమంత సొంత గొంతు వినొచ్చు మనం.

నితిన్ హీరోగా, హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న “అఆ” కి అనిరుధ్ సంగీత దర్శకుడు.ప్రేమికుల రోజు కానుకగా వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube