వారిద్దరినీ ఆ విషయంలో కొట్టాలని చూస్తున్న సమంత  

Samantha To Compete With Vijay Sethupathi And Nayanthara - Telugu Jaanu, Kollywood Movie News, Nayanthara, Samantha, Vijay Sethupathi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Samantha To Compete With Vijay Sethupathi And Nayanthara - Telugu Jaanu, Kollywood Movie News, Nayanthara, Samantha, Vijay Sethupathi-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత సమంత యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు.కానీ ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం బొక్కబోర్లా పడింది.

దీంతో సమంత నెక్ట్స్ మూవీ ఏమిటా అని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సమంత తెలుగులో కాకుండా తమిళంలో తన నెక్ట్స్ మూవీని ఇటీవల ఓకే చేసింది.

‘కాత్తువక్కుల రెందు కాదల్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటిస్తండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లాంటి స్టార్స్ నటిస్తుండగా సమంత ఎందుకు చేస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే నయనతార, విజయ్ సేతుపతి వంటి వారితో నటించే అవకాశం దొరకడం నిజంగా గ్రేట్ అని, వారితో కలిసి నటిస్తే నటనకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవచ్చని సమంత అంటోంది.అంతేగాక నటన విషయంలో వారితో పోటీపడి నటించాలని, వారిద్దరని తన నటనతో ఓడించాలని తన కోరిక అని సమంత తెలిపింది.

మరి టాప్ స్టార్స్‌ పోటీపడి నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంతో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు