'జనతా గ్యారేజ్' ప్రమోషన్ కి సమంతా వస్తుందా?

జనతా గ్యారేజ్ సినిమా విడుదల దగగ్ర పడుతున్న కొద్దీ అందరి చూపు సమంతా మీద పడింది.ఆమె ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ కి డుమ్మా కొట్టేసింది.

 Samantha On Janatha Garage Movie Promotions-TeluguStop.com

అప్పుడు ఆరోగ్యం బాగా లేదని తప్పించుకుంది.ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

ఆల్రెడీ ఎన్టీఆర్ ఛానల్స్ ని తన ఆఫీస్ కి పిలిచి ఇంటర్వ్యూ లు ఇచ్చేసాడు.ఇక ఈ రోజు యు/ఎ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది.

సోమవారం నుండి కొరటాల శివ – దేవిశ్రీప్రసాద్ – నిత్యా మీనన్ కూడా ప్రమోషన్స్ కి వస్తారట.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సమంతా ప్రమోషన్స్ కి వస్తుందా…రాదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

అయితే సమంతా సన్నిహితులు మాత్రం సమంతా మీడియా ముందుకు వస్తే నాగ చైతన్యతో ప్రేమ వ్యవహారం, పెళ్లి వంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుందని మీడియా ముందుకు రావటం లేదని చెప్పుతున్నారు.కానీ తమిళనాడులో చాలా రిబ్బన్ కటింగులకు వెళుతూ అక్కడి మీడియాతో బాగానే మాట్లాడుతోంది.

అంతేకాక ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటోంది ఈ భామ.సామంతా ఏమి చేస్తుందో వేచి చూద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube