చివరకు నాగార్జున కూడా సమంత సాయం తీసుకుంటున్నాడా.. మామ కోసం మళ్లీ సమంత  

Samantha To Act In Nagarjuna Manmadhudu 2-manam,manmadhudu 2 Movie,nagarjuna,raju Gari Gadhi-2,sam With Nag,samantha

నాగచైతన్య కెరీర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయనకు ఈ సమయంలో ఒక మంచి సక్సెస్‌ అవసరం ఇలాంటి సమయంలో భర్త కోసం సమంత ‘మజిలీ’ చిత్రాన్ని చేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మజిలీ’ చిత్రంతో నాగచైతన్యకు కమర్షియల్‌ సక్సెస్‌ రావడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే సమంత త్వరలోనే నాగార్జునతో కలిసి కూడా ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాంతో నాగార్జునపై కూడా సోషల్‌ మీడియాలో రకరకాల ట్రోల్స్‌ వస్తున్నాయి...

చివరకు నాగార్జున కూడా సమంత సాయం తీసుకుంటున్నాడా.. మామ కోసం మళ్లీ సమంత-Samantha To Act In Nagarjuna Manmadhudu 2

వాటిని అక్కినేని ఫ్యాన్స్‌ తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకు విషయం ఏంటీ అంటే. నాగార్జున మరియు రాహుల్‌ రవీంద్రన్‌ల కాంబినేషన్‌లో ‘మన్మధుడు 2’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు పాయల్‌ రాజ్‌ పూత్‌లను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో సమంత కూడా ఉంటుందని తెలుస్తోంది.

తన సినిమాలో సమంత ఉంటే క్రేజ్‌ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయించి సమంతకు చిన్న పాత్రను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మామ మూవీ సక్సెస్‌ కోసం తప్పకుండా సమంత ఆ పాత్ర చేస్తానంటూ హామీ ఇచ్చిందట. ఇప్పటికే ‘మనం’ చిత్రంలో కలిసి నటించిన నాగార్జున మరియు సమంతలు ‘రాజుగారి గది 2’ చిత్రంలో నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మన్మధుడు 2 చిత్రం కోసం మామ కోడలు కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరి మద్య రిలేషన్‌ ఎలా ఉంటుందనేది చూడాలి. సమంత పాత్ర చిన్నదే అయిన సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ చిత్రంలో సమంతను నటింపజేయాలనే ఆలోచన రాహుల్‌ రవీంద్రది అని, ఆయన కోరిక మేరకు అతడితో ఉన్న సన్నిహిత్యంతో ఈ చిత్రంలో నటించేందుకు సమంత ఓకే చెప్పిందని, నాగార్జున అసలు ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఆమెతో చర్చించలేదని కొందరు చెబుతున్నారు. అసలు విషయం ఏంటో కాని ‘మన్మధుడు 2’ చిత్రంలో సమంత నటించబోతుందన్న వార్త అక్కినేని ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తుంది.