తమిళ వివాదంతో సమంత ఫ్యాన్స్ ఆందోళన

తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్ అయిన సమంత మొదటి సారి వెబ్‌ సిరీస్ లో నటించింది.అది కూడా హిందీ వెబ్ సిరీస్ అవ్వడంతో అందరి దృష్టి ఆ వెబ్ సిరీస్ పై ఉంది.

 Samantha The Family Man 2 Role Controversy , Samantha , The Family Man 2 , Tolly-TeluguStop.com

అమెజాన్‌ ప్రైమ్‌ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కు సీక్వెల్‌ గా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత నటించింది.వెబ్‌ సిరీస్‌ లో సమంత నటించిన విషయం ఎప్పుడో తెలుసు ఉగ్రవాది గా కనిపించబోతుంది అంటూ కొన్నాళ్లుగా తెలుసు.

తాజాగా విడుదల అయిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 ట్రైలర్ తో వెబ్‌ సిరీస్ లోని సమంత పాత్రపై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.వెబ్‌ సిరీస్‌ లో సమంత నిజంగానే ఉగ్రవాదిగా కనిపించబోతుంది.

అది కూడా తమిళ ఉగ్రవాది.హిందీ వర్షన్‌ ట్రైలర్‌ లో సమంత తమిళ డైలాగ్ లు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించాయి.కాని కొందరి మనోభావాలను మాత్రం దెబ్బ తీస్తున్నాయి.,/br.

తమిళ ప్రేక్షకులు సమంత తమిళ ఉగ్రవాదిగా కనిపించడం ఏమాత్రం బాగాలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడు వారికి ఎల్‌ టీ టీ ఈ తో సంబంధం ఉందని మొదటి నుండే ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి సమయంలో సమంత ను ఉగ్రవాదిగా తమిళం కు చెందిన వ్యక్తిగా చూపించడం వల్ల తమిళనాడు ప్రతిష్ట మరింతగా దిగజారుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడు కు చెందిన కొందరు ఈ వెబ్ సిరీస్ లోని సమంత పాత్రను చేంజ్ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

మొన్నటి వరకు పాకిస్తానీ ఉగ్రవాది గా సమంత కనిపించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కాని ఇందులో మాత్రం తమిళం తెలిసిన ఉగ్రవాదిగా సమంత కనిపించబోతుంది.ప్రస్తుతం జరుగుతున్న చర్చ చూస్తుంటే వెబ్‌ సిరీ స్ట్రీమింగ్‌ సమయంలో సమంత పాత్రపై మరింత గా విమర్శలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube