సమంత వివాదంకు ఇలా చెక్ పెట్టిన ఫ్యామిలీ మ్యాన్‌

సమంత నెగటివ్ షేడ్స్ లో మొదటి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ అనూహ్యంగా వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను నేడు స్ట్రీమింగ్‌ చేశారు.

 Samantha The Family Man 2 Release  Samantha,  Tamilanadu , The Family ,man Web S-TeluguStop.com

అయితే ఈ వెబ్‌ సిరీస్ విడుదల అయిన తర్వాత రచ్చ రచ్చగా గొడవ జరగడం ఖాయం అంటూ చాలా మంది భావించారు. తమిళ ప్రేక్షకులు ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి వివాదాస్పద అంశాలు ఉంటే తీసేయాలని లేఖ ఇప్పించేలా ఒత్తిడి చేశారు.

అంతటి వివాదం రాజుకున్న ఈ సినిమా విడుదల తర్వాత మరింతగా ముదిరే అవకాశం ఉందని అంతా భావించారు.దాంతో మేకర్స్ వ్యూహాత్మకంగా ఈ వెబ్‌ సిరీస్‌ ను మొదట కేవలం హిందీ లో నే స్ట్రీమింగ్‌ చేశారు.

అది కూడా మొదట ఒక్కో పార్ట్ చొప్పున అనుకున్నారు కాని అన్ని ఎపిసోడ్‌ లను కూడా ఒకే సారి స్ట్రీమింగ్‌ చేశారు.హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతున్ నీ వెబ్‌ సిరీస్ వారం లేదా రెండు వారాల్లో తమిళంలో కూడా స్ట్రీమింగ్‌ మొదలు అవ్వబోతుంది.

అప్పటి వరకు తమిళ జనాలు కాస్త సైలెంట్‌ అయ్యే అవకాశం ఉంది.తమిళులను ఎలాంటి కించపర్చే సన్నివేశాలు లేవు అంటూ క్లారిటీ వస్తుంది.కనుక అప్పుడు చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని మేకర్స్ వ్యూహాత్మకంగా ఈ వెబ్‌ సిరీస్ ను తమిళ వర్షన్ ను విడుదల చేయలేదు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే నేడే హిందీ తో పాటు తమిళం మరియు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యేది.

కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో తమిళ వివాదం దృష్టి లో పెట్టుకుని విడుదల విషయంలో వాయిదా వేశారు.ముందు ముందు కూడా ఇలాంటి వివాదాలు లేకుండా ది ఫ్యామిలీ మ్యాన్ తమిళ వర్షన్‌ లో ఏమైనా మార్పులు చేసే అవకాశం కూడా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube