ఇప్పుడు నీకు సంతోషమా సామ్‌.. ఫ్యాన్స్ అసంతృప్తి

ఏ హీరోకు అయినా హీరోయిన్‌ కు అయిన నెగటివ్‌ రోల్స్ చేయడం అంటే ఛాలెంజింగ్‌ గా ఉంటుంది.నటిగా లేదా నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు కేవలం నెగటివ్ రోల్స్ చేస్తేనే ఆ గుర్తింపు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల మరియు విశ్లేషకుల అభిప్రాయం.

 Samantha The Family Man 2 Look Bad Comments , Flim News, Raj And Dk, Samantha, T-TeluguStop.com

హీరో లేదా హీరోయిన్ గా సక్సెస్ అయిన వారు ఏదో ఒక సమయంలో విలన్ గా కనిపించాలని ఆశ పడతారు.కొందరికి అది సాధ్యం కాదు.

కాని కొందరికి అది సాధ్యం అవుతుంది.సమంతకు అది సాధ్యం అయ్యింది.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ తో సమంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ హిందీ వెబ్‌ సిరీస్ లో సమంత ఉగ్రవాది గా కనిపించింది.

ఇటీవలే ట్రైలర్ కూడా వచ్చేసింది.వచ్చే నెలలో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్ లో సమంత లుక్ చాలా మాసీగా ఉంది.

బాబోయ్ ఇలా ఉంది ఏంటీ అంటూ సమంత అభిమానులు జుట్టు పీక్కునేలా ఉంది.

సమంతను అందంగా చూడాలనుకునే వారికి ఈ వెబ్‌ సిరీస్ లో ఆమె లుక్ ఖచ్చితంగా నచ్చదు.

వారికి ఇది జీర్ణించుకునే విషయం కాదు.అయినా కూడా వారు ఈ వెబ్‌ సిరీస్ ను ఆధరిస్తారో లేదో తెలియదు.

నెట్టింట కొందరు సమంత అభిమానులు ఆమె ది ఫ్యామిలీ మ్యాన్‌ లుక్ ను షేర్‌ చేస్తు ఇది నీకు సంతోషమా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇలా నిన్ను చూడటం మా వల్ల కాదు.

నీవు ఒక ఏంజిల్‌ ఎప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలని ఆశ పడుతున్నాము.కాని నువ్వు మాత్రం ఇలా మాసి పోయిన డ్రస్‌ లతో కనిపించావు.

ఫ్యాన్స్ అసంతృప్తి పై సమంత ఎలా రియాక్ట్‌ అవ్వబోతుంది అనేది చూడాలి.త్వరలో సమంత నుండి శాకుంతలం సినిమా రాబోతుంది.

అందులో ఆమె అందగత్తెలకే అందగత్తె గా కనిపించబోతుంది.ఇక తమిళంలో కూడా విజయ్ సేతుపతికి జోడీగా ఒక సినిమా చేస్తోంది.

అందులో కూడా సమంత అందంగా కనిపించబోతుంది.కనుక ది ఫ్యామిలీ మ్యాన్ లో డి గ్లామర్ గా నటించినా కొందరు అభిమానులు తప్ప మిగిలిన అభిమానులు ఎక్కువగా నిరాశ చెందడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube