మరో వారం రోజుల్లో షాకింగ్ నిర్ణయాన్ని బయటపెట్టనున్న సమంత?

గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసిన, విన్న సమంత టాపిక్ సంచలనంగా మారింది.వీరు విడాకుల విషయం ప్రకటించి పది రోజులు కావస్తున్నప్పటికీ సమంత నాగ చైతన్య విడాకుల గురించి వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

 Samantha Takes Fast Decision After Her Break Up With Naga Chaitanya Naga Chaitan-TeluguStop.com

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవేనా అంటే ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ లు చేయడంతో సమంత ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.అయితే సమంత తన జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను మర్చిపోయే పనిలో పడ్డారు.

ఈ క్రమంలోనే తన ప్రేమ తాలూక విషయాలను మరిచిపోయి జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విడాకులు ప్రకటించిన రెండు రోజులకే ఒక యాడ్ షూట్లో పాల్గొన్న సమంత కొంతవరకు ఎమోషనల్ అయినప్పటికీ విడాకుల నుంచి బయట పడాలని సినిమాల పై దృష్టిసారించారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే సమంత మూడు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకొని తన జీవితంలో జరిగిన సంఘటనలను మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తోంది.

అయితే ఈమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పినప్పటికీ ఆ సినిమాల గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Telugu Fast, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

ఈ క్రమంలోనే మరొక వారం రోజులలో సమంత తన మూడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించాలని చిత్ర బృందాన్ని కోరినట్టు తెలుస్తోంది.అయితే 3 సినిమా ప్రాజెక్టులు కూడా ఒకే రోజు అనౌన్స్ చేయాలని సమంత చెప్పినట్లు సమాచారం.ఇలా వారం రోజులలో సినిమాలను ప్రకటించి ఇకపై తన జీవితంలో బిజీగా ఉండబోతుంది.

అయితే సమంత ఇదివరకు నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube