కుక్కలు, పిల్లులతో సమంత ఒంటరిగా చనిపోవాలి.. నెటిజన్ కామెంట్ కు సామ్ అదిరిపోయే రిప్లై!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.

 Samantha Shocking Reply To Netizen Comments That She Would Die Alone With Dogs And Cats Details, Samantha, Tollywood, Comments, Telugu Film Industry, Samanth Reply, Naga Chaitanya, Samantha Divorce, Samantha Cats And Puppies, Star Heroine Samantha-TeluguStop.com

అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

తొలిసారిగా సమంత ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

 Samantha Shocking Reply To Netizen Comments That She Would Die Alone With Dogs And Cats Details, Samantha, Tollywood, Comments, Telugu Film Industry, Samanth Reply, Naga Chaitanya, Samantha Divorce, Samantha Cats And Puppies, Star Heroine Samantha-కుక్కలు, పిల్లులతో సమంత ఒంటరిగా చనిపోవాలి.. నెటిజన్ కామెంట్ కు సామ్ అదిరిపోయే రిప్లై-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను నుండి మార్కులు సంపాదించుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా కొంత ఫాలోయింగ్ సొంతం.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లిందనే చెప్పాలి.చాలా వరకు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.విడిపోయిన సంగతి కూడా తెలిసిందే.నిజానికి పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

వెండితెరపైనే కాకుండా ఓటీటీ ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించింది.

పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలిచింది.

అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.

ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.

తనకు అక్కినేని ఫ్యామిలీతో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.పైగా అవకాశాలు కూడా బాగా అందుకుంటుంది.అటు టాలీవుడ్, కోలివుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి పడిపోయింది.

దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం సమంత కోసం బాగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

ఇక సమంత తన ఫ్రెండ్స్ తో కూడా బాగా చిల్ అవుతూ ఉంటుంది.వారితో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తనను ట్రోల్ చేసిన నెటిజన్ కు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

నిజానికి సమంత తన పెంపుడు జంతువులు కుక్క పిల్లలతో బాగా గడుపుతోంది.వాటికి సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

అయితే ఇటీవలే సమంత తన కుక్క పిల్లల తో తనకున్న అనుబంధాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలుపుతుంది.దాంతోనే ఓ నెటిజన్ ఆమె పిల్లులు, కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి అని కామెంట్ చేయగా.

వెంటనే సమంత అలా జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను అని అదిరిపోయే రిప్లై ఇచ్చింది.ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube