నన్ను నేను మహారాణిలా ఊహించుకుంటా.. నటి సమంత కామెంట్స్ వైరల్!

Samantha Shocking Comments About Shakuntalam Movie

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే పలు సినిమాల ద్వారా విజయాలను అందుకున్న సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్ర ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

 Samantha Shocking Comments About Shakuntalam Movie-TeluguStop.com

ఇటీవల సమంత వివాహ బంధానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారనే సంగతి తెలిసిందే.

సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది.

 Samantha Shocking Comments About Shakuntalam Movie-నన్ను నేను మహారాణిలా ఊహించుకుంటా.. నటి సమంత కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ స్పెషల్ సిరీస్ అవుతుందని అనుకున్నానని కానీ ఈ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని తాను భావించలేదని ఆమె చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ మ్యాన్2 సక్సెస్ నుంచి మరింత ఎక్కువగా కష్టపడాలనే స్పూర్తిని పొందానని సమంత పేర్కొన్నారు.

తనకు ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం కాబట్టే శాకుంతలం రోల్ లో నటించానని శాకుంతలంలో తాను అందంగా కనిపిస్తానని సమంత పేర్కొన్నారు.పురాణ కథలు చదివే సమయంలో తనను తాను మహారాణిలా ఊహించుకుంటానని డ్రీమ్ రోల్ ను చేసే అవకాశం తనకు శాకుంతలం సినిమాతో దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.అల్లు అర్హ రాక్ స్టార్ అని ఆ పాప గురించి ఏం చెప్పినా తక్కువే అని సమంత చెప్పుకొచ్చారు.

Telugu Familymen 2, Interesting Facts, Samantha, Shakuntalam Movie, Shocking Comments, Tollywood-Movie

అర్హ తెలుగు అద్బుతంగా మాట్లాడుతుందని అల్లు అర్హ భవిష్యత్తులో చిత్రపరిశ్రమను ఏలబోతుందని సమంత పేర్కొన్నారు.బాలీవుడ్ లో సినిమా ఆఫర్లు వస్తే ఖచ్చితంగా చేస్తానని సామ్ వెల్లడించారు.హెడ్ లైన్స్ కోసం అడిగే ప్రశ్నలు తనకు నచ్చవని సమంత చెప్పుకొచ్చారు.

నేను చేసిన చాలా సినిమాలు టీవీలో వస్తుంటే టీవీని వెంటనే ఆపేస్తానని నన్ను నేను అలా చూసుకోవడం నచ్చదని ఆమె వెల్లడించారు.

#Shakuntalam #Samantha #Familymen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube