అద్దం ముందు ఆ పని చేసిన సమంత.. వీడియో వైరల్..?

తెలుగులో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు టాక్ షోలు కూడా చేస్తున్నారు.పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సమంత బ్రాండ్ల ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు మరోవైపు సాకీ పేరుతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరలతో క్లోతింగ్ బిజినెస్ ను ప్రారంభించిన సమంత సాకీ ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నట్టు వెల్లడించారు.

 Samantha Shipping Her Clothing Brand International Video Goes Viral, Clothing Br-TeluguStop.com

అయితే సాకీ బ్రాండ్ ను మరింత ప్రమోట్ చేయాలని భావిస్తున్న సమంత అద్దం ముందు నిలబడి సాకీ వరల్డ్ బ్రాండ్ దుస్తులలో కెమెరాకు ఫోజులిచ్చారు.సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా సాకీ వరల్డ్ దుస్తులలో ఫోజులిచ్చిన వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఫ్యాషన్ కు ఐకాన్ గా గుర్తింపును సొంతం చేసుకుంటున్న సమంత మలేషియా, సింగపూర్ లతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లకు కూడా దుస్తులను ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.

సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపారవేత్తగా సక్సెస్ కావడం గమనార్హం.సమంత షేర్ చేసిన వీడియోకు 17 లక్షల కంటే ఎక్కువ లైకులు రావడం గమనార్హం.ప్రస్తుతం శాకుంతలం మినహా మరే సినిమాలో నటించని సమంత శాకుంతలం సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరి సమంత నిజంగా గ్యాప్ తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న శాకుంతలం మూవీలో ప్రస్తుతం సమంత పాల్గొంటున్నారు.

సమంత ఈ సినిమాలో టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రను పోషిస్తున్నారు.వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సమంత కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube