ఒంటరిగా జీవించడం ఓ గొప్ప బహుమతి... అవకాశం వస్తే వదులుకోవద్దు: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు ఏడాదిపాటి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి తరుణంలో ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరం అవుతూ చికిత్స తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం సమంత న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొద్దిరోజుల పాటు ఈమె ఇక్కడే ఉంటూ చికిత్స తీసుకొని తిరిగి ఇండియా రాబోతున్నారని తెలుస్తుంది.

ఇక సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా( Social media )లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నారు.తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇందులో సమంత రాసుకొస్తూ.

మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒంటరిగా వెళ్లడానికి ప్రయత్నం చేయండి ఒంటరిగా నడవండి డాన్స్ చేయండి ఒంటరిగా ప్రయాణం చేయండి.మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం లభిస్తే ప్రపంచం కోరుకున్న విధంగా కాకుండా మీకు నచ్చిన విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

Advertisement

చాలామందికి మీ పక్కన ఎవరైనా నిలబడితే ఎలా నిలబడాలో మీకు తెలుసు అది మీ కథ కాదు కానీ ఒంటరిగా జీవించే ఛాన్స్ వస్తే ఒంటరిగా జీవించండి అలా ఒంటరిగా జీవించే అవకాశం రావడం అరుదైన బహుమతి.ఇది మీ గమ్యాన్ని మార్చే అంతర దృష్టినిమీకు తెలియచేస్తుంది అంటూ సమంత చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సరసన ఖుషి సినిమా( Khushi Movie )లో నటించి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండ మాత్రమే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు