సమంత ఫిట్నెస్ వీడియోపై నందిని రెడ్డి సెటైర్స్.. వీడియో వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Samantha Shared Workout Video Director Nandini Reddy React With Funny Post Now I-TeluguStop.com

సినిమా సినిమాకి తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.అంతే కాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరికి రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరమైన సమంత ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించి తాను మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్లీ ఎక్ససైజ్లు జిమ్ములు అంటూ కష్టపడుతోంది.

అంతేకాకుండా మళ్ళీ సినిమాలలో ఎప్పుడు ఇలాగే బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.సమంత చేతినిండా ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోని సమంత నటించిన శాంకుతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సమంత ఎక్కువగా వర్క్ ఔట్స్ చేస్తూ కనిపిస్తోంది.దాంతో అభిమానులు మొన్నటి వరకు ఆ వ్యాధితో పోరాడావు ఇంకొన్ని రోజులు రెస్టు తీసుకుంటే బాగుండు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తన వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.

అందులో భాగంగానే తాజాగా జిమ్‌లో వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.మయో సైటిస్‌ వ్యాధి కారణంగా కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకునేందుకు తన ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకునేందుకు గట్టిగానే శ్రమిస్తోంది.

కాగా తాజాగా సమంత ఆ వీడియోను షేర్ చేస్తూ.లావుగా ఉన్న మహిళలకు ఇది ముగియదు, క్లిష్టమైన సమయంలో నాకు చేరువై, నన్ను ఇన్ స్పైర్‌ చేసిన గ్రావిటీ మ్యూజీషియన్‌ బ్రాండ్‌కి ధన్యవాదాలు.

సాధ్యమైనంత వరకు కఠినమైన డైట్‌లో ఉండటం వల్ల మనం తిన్న ఆహారం వల్లే బలం రాదని, మన ఆలోచిస్తారో విధానం పైనా ఆది ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయంఅని చెప్పింది సమంత.

ఇందులో తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ జునైద్‌ని ట్యాగ్‌ చేయడం విశేషం.దీంతో సమంత పోస్ట్ వైరల్‌ అవుతుంది.అయితే ఈ వీడియో పై దర్శకులు నందిని రెడ్డి స్పందించింది.

సమంత రెండు చేతులతో వర్కౌట్స్ చేస్తుండగా, తాను మాత్రం ఒక్క చేత్తోనే చేశానని చెప్పారు.నువ్వు ఫీల్‌ అవుతావనే కారణంతో ఆ వీడియోని పోస్ట్ చేయలేదని ఫన్నీగా పోస్ట్ చేసింది నందిని రెడ్డి.

అనంతరం సమంత కూడా రియాక్ట్ అవుతూ అదిరిపోయే పోస్ట్ పెట్టింది.మీ దయకి ధన్యవాదాలు అంటూ ముతి తిప్పిన ఎమోజీని పంచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube