ఆ నొప్పిని భరించడం కష్టం.. సమంత కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్యల విడాకుల విషయం గురించి సంచలనంగా మారింది.వీరి విడాకుల ప్రకటన తర్వాత విడాకులకు కారణాలు ఏమిటంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

 Akkineni Samantha Shared Emotional Video Message On Instagram Details,  Samantha-TeluguStop.com

ఈ క్రమంలోనే సమంత గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆమెకు ఇతరులతో అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై సమంత స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.

విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను వీడియోల ద్వారా, పోస్టుల ద్వారా బయట పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయం పై మరొకసారి పరోక్షంగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

విడాకుల ప్రకటన అనంతరం తన జీవితంలో ముందుకు సాగాలని సమంత ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడమే కాకుండా తన శరీర ఫిట్నెస్ పై శ్రద్ధ చూపిస్తూ.

ఎక్కువగా జిమ్ లో గడుపుతున్నారు.తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో తన స్నేహితులతో కలసి జిమ్ లో కుస్తీ పడుతూ ఉన్నటువంటి వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోను పోస్ట్ చేయడమే కాకుండా ఫిట్ గా ఉన్న వారితో పోటీ వద్దు.అలాంటి వారితో పోటీ పడిన తర్వాత వచ్చే నొప్పిని భరించడం కష్టం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే సమంత చేసిన కామెంట్స్ పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి చేశారు.ఇందులో మరో అర్థం ఏదైనా దాగి ఉందా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఇలా సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube