సమంత అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17 తారీఖున విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.విడుదలకు నెల రోజుల ముందే అంటే గత నెలలో సినిమా యొక్క ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.
దాంతో సినిమా విడుదల తేదీ మార్చరని ఖచ్చితంగా అదే రోజున వస్తుందని సమంత అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే శాకుంతలం సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది.
శాకుంతలం సినిమా కు దర్శక నిర్మాత గుణశేఖర్ స్పీడ్ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.

ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ మినహా ఇప్పటి వరకు మరే ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయలేదు.ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి కూడా కనిపించడం లేదు.అందుకే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అదే రోజున మరికొన్ని సినిమాలు ఉన్న కారణంగా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని, అందుకే మరో విడుదల తేదీకి వెళ్లాలని ఉద్దేశంతో గుణ శేఖర్ ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సోలో రిలీజ్ కోసం గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడని.అందుకే ఫిబ్రవరి 17వ తారీకుని స్కిప్ చేసే ఉద్దేశంతోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు మాట్లాడుకుంటున్నారు.ఆ విషయమే క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఒకవేళ సినిమా ఆలస్యమైతే మాత్రం సమంత ఫ్యాన్స్ దర్శకుడు గుణశేఖర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.ఇప్పటికే ఈ సినిమా పలు సందర్భాల్లో వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
మరో సారి సమంత ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ తప్పదేమో.
