సమంత మేడం ఈ మాత్రం ఎలా సరిపోతుంది మీరే చెప్పండి!

సమంత( Samantha ) హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం( shakuntalam ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.ఏప్రిల్ 14వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని స్పీడ్ పెంచక పోవడం పట్ల సమంత అభిమానులు మరియు సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 Samantha Shakuntalam Movie Release And Promotions Update  , Samantha ,  Dil Raju-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కి దిల్ రాజు సమర్పకుడు అనే విషయం తెలిసిందే.అయినా కూడా సినిమా కి కావాల్సిన బజ్ క్రియేట్ అవ్వలేదు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు గత ఏడాది ఆరంభంలోనే పూర్తయ్యాయి.గ్రాఫిక్స్ వర్క్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు.

గుణశేఖర్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆయన గత చిత్రం రుద్రమదేవి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అనుష్క హీరోయిన్ గా నటించిన ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సమంతతో శాకుంతలం సినిమాను రూపొందించాడు.గుణశేఖర్‌ సినిమా అంటే మినిమం ఉంటుందని అభిమానులు భావిస్తారు.

సమంత ఈ మధ్య కాలం లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దున్నేస్తోంది.భారీగా వసూళ్లని దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఈ సినిమా కి మొన్నటి వరకు టాక్ వచ్చింది.

కానీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదల విషయంలో అభిమానులు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ దర్శక నిర్మాత గుణశేఖర్ పై విమర్శలు( Gunasekhar ) గుప్పిస్తున్నారు.సమంత మేడం ఈ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.శాకుంతలం సినిమా ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.

అయినా మినిమం బజ్ క్రియేట్ అవ్వలేదు.కనుక ప్రమోషన్స్ అయినా కాస్త యాక్టివ్ గా చేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube