సమంత ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్‌.. ఈ సినిమా కూడా వాయిదాల పర్వం

సౌత్ స్టార్‌ హీరోయిన్ సమంత నటించిన తెలుగు సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.పుష్ప లో ఐటెం సాంగ్ చేసిన సమంత త్వరలోనే యశోద సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.

 Samantha Shakuntalam And Yashoda Movies Are Release Postpone , Flim News , Gunas-TeluguStop.com

ఆగస్టు రెండవ వారంలో యశోద సినిమా వస్తుందని సమంత ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదే సమయంలో గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా ను కూడా ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఈ రెండు సినిమాల విషయంలో సమంత ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు నిరాశ చెందుతున్నారు. గుణశేఖర్‌ ఇప్పటి వరకు కనీసం విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన చేయకుండా వాయిదాల పర్వం కొనసాగిస్తూ ఉంటే సమంత ఫ్యాన్స్ ఆ సినిమా విషయంలో ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

గ్రాఫిక్స్ వర్క్‌ ను ఆరు నెలల కంటే ఎక్కువ చేయిస్తున్నారు ఇదేమైనా బాహుబలి 2 నా లేదంటే ఆదిపురుష్‌ సినిమా అంటూ అసహనం తో ఉన్నారు.ఇక సమంత గత చిత్రాల విషయానికి వస్తే కాతువాకుల రెండు కాదల్ సినిమా తమిళంతో పాటు తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సమంత ఓటీటీ లో మరో ప్రాజెక్ట్‌ ను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.త్వరలోనే హిందీ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి సమంత ఈ రెండు సినిమా లతో సూపర్‌ హిట్ లు అందుకోబోతుంది అనుకుంటే.ఈ రెండు సినిమా లు కూడా విడుదల కాకుండా వాయిదాల పర్వం లో ఉన్నాయి.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.యశోద సినిమా ను ఆగస్టు నుండి వాయిదా వేసి సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నారట.

మరి శాకుంతంలం ఎప్పుడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube