విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సామ్.. నెట్టింట వైరల్!

Samantha Sensational Comments On Her Divorce

టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే కపుల్స్ లో సమంత, నాగ చైతన్య ముందు వరుసలో ఉండే వారు.అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సామ్, నాగ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

 Samantha Sensational Comments On Her Divorce-TeluguStop.com

గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సామ్ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి వివాహ బంధానికి నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు కానీ అందుకు గల కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.కానీ సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టి వరుస సినిమాలు ప్రకటిస్తూ ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు.

 Samantha Sensational Comments On Her Divorce-విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సామ్.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సమంత విడాకుల తర్వాత మానసికంగా దృఢంగా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది.

సామ్ విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తుంది.

ఇటీవలే హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.అయితే విడాకుల విషయంలో సామ్ ఎంత బాధ పడిందో ఆమెనే స్వయంగా మీడియాకు తెలిపింది.

తాజాగా సమంత ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విడాకుల విషయంపై స్పందించింది.విడాకులు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నారో.

అందుకు ఎంత బాధపడిందో తెలిపింది.

Telugu Divorce, Naga Chaitanya, Samantha, Samanthanaga, Tollywood-Movie

సామ్ మాట్లాడుతూ.”మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చర్చల తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.ఇందులో తప్పు ఎవరిదీ అనేది నేను చెప్పలేను.

కానీ విడాకులు తీసుకున్నాకా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో నాకు తెలిసింది. నేను విడాకుల తర్వాత చనిపోతానేమో అనుకున్నాను.

నేను అంత బలహీనురాలిగా అనిపించింది.ఆ తర్వాత మెల్లగా నా సమస్యలతో పోరాడి.

కృంగిపోకుండా పైకి లేచి ఈ రోజు మీ ముందు ఇంత దృఢంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ సామ్ తెలిపింది.ఇక సామ్ విడాకులపై చేసినవ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Samantha #SamanthaNaga #Divorce #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube