విడాకుల ప్రకటనకు ముందు బాధతో సమంత పోస్ట్.. సర్వనాశనం కావాలంటూ?

సినిమాలలో హీరోహీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సాధారణంగా జరుగుతుందనే విషయం తెలిసిందే.అయితే చైతన్య, సమంతల ప్రేమకథ కూడా సినిమా ప్రేమకథను పోలి ఉంటుంది.

 Samantha Sensation Insta Status After Divorce Statement Details, Divorce, Insta-TeluguStop.com

ఒకానొక సందర్భంలో మా ఇద్దరికీ ప్రేమ ఎక్కడ మొదలైందో తెలియదని అంతా సినిమా కథలా జరిగిందని చెప్పుకొచ్చారు.అయితే సమంత మాత్రం ఏ మాయ చేశావే సినిమా సమయంలో చైతన్యను కలిసినప్పుడు తొలిసారి హాయ్ చెప్పానని అన్నారు.

షూటింగ్ సమయంలో చైతన్య తనకు ఎంతో సహాయం చేసేవాడని ఆ సమయంలోనే తమ స్నేహం ప్రేమగా మారి మరింత బలపడిందని సమంత చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో తన తొలి ఫ్రెండ్ చైతన్య అని తన గురించి చైతన్య, చైతన్య గురించి తనకు పూర్తిగా తెలుసని పెళ్లికి ముందు సమంత ప్రకటించారు.

అయితే నిన్న విడాకుల ప్రకటనకు ముందు సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సమంత చైతన్యను ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టిందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Divorce, Insta, Samantha-Movie

ఏ విషయాన్ని అయినా సమంత ప్రత్యక్షంగా చెప్పడానికి ఇష్టపడరు.ఆమె షేర్ చేసిన పోస్ట్ లో బాధ, నిస్పృహలతో ఉన్న సమయంలో తనకు ఒక విషయం అర్థమైందని సమంత పేర్కొన్నారు.ప్రేమ చివరకు గెలవడం అనేది చారిత్రక సత్యమని ఆమె చెప్పుకొచ్చారు.కొంతమంది ద్రోహులు, నియంతలు, హంతకులు ఉంటారని వాళ్లు వెన్నుపోటు పొడుస్తారని సమంత చెప్పుకొచ్చారు.

Telugu Divorce, Insta, Samantha-Movie

కనపడకుండా కుట్ర చేసే విషయంలో వాళ్లు నిపుణులని చివరకు వాళ్లు సర్వ నాశనమవుతారని సమంత పేర్కొన్నారు.ఈ నిజాన్నే చరిత్ర చెబుతోందని మా అమ్మ నాకు చెప్పిన నిజం కూడా ఇదేనంటూ సమంత పోస్ట్ లో చెప్పుకొచ్చారు.సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube