తమన్నా కి కంగ్రాట్స్ డార్లింగ్ అంటున్న స్టార్ హీరోయిన్...   

Samantha Send Wishes To Tamanna - Telugu Amantha Send Wishes To Tamanna, Samantha, Samantha Akkineni News, Samantha News, Tamanna Milky Beauty, Tamanna News, Tollywood Heroins

టాలీవుడ్ లో దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించినటువంటి హీరోయిన్లలో ముంబై భామ మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.అయితే ఈ భామ తెలుగులో మంచు మనోజ్ నటించిన టువంటి “శ్రీ” అనే చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయింది.

Samantha Send Wishes To Tamanna

అయితే అప్పటి నుంచి తన సినీ కెరియర్ మొదలైన కొత్తలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కొంతకాలం తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.అంతేకాక అవకాశాలను సద్వినియోగం చేసుకొని దూసుకుపోతోంది ఈ అమ్మడు.

అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చి దాదాపుగా పదిహేను సంవత్సరాల అవుతోంది.ఈ పదిహేనేళ్ల సంవత్సర కాలంలో దాదాపుగా 60కి పైగా చిత్రాల్లో నటించింది.

అంతేగాక పలు స్పెషల్ పాటల్లో కూడా చిందులేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు సినీ పరిశ్రమకు వచ్చి 15 సంవత్సరాలు కావస్తుండడంతో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.

ఇందులో “అందం, నిజాయితీ, కష్టించే తత్వం, వంటి గుణాలు కలిగినటువంటి అతి కొద్ది మందిలో తమన్నా ఒకరంటూ పొగడ్తలతో ముంచెత్తింది.అంతేగాక  తమన్నా స్క్రీన్ పై నటిస్తుంటే చూపు తిప్పుకోలేరని, కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ ప్రేమతో ట్వీట్ చేసింది.

అయితే వీటిపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.ఇందులో భాగంగా సమంత ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి, పాత్రలను ఎంచుకునే విధానంలోనూ మరియు వాటిలో నటించిన తీరు తనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని తమన్నా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సమంత చేసిన ట్వీట్ పై స్పందించింది.అయితే ప్రస్తుతం తమన్నా సిటీ మార్ అనే ఈ చిత్రంలో నటిస్తోంది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి ఈ చిత్రం లో తమన్నా కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test