కూరగాయలమ్మిన సమంత..! సినిమా షూటింగ్, రియాలిటీ షో కాదు.! ఎందుకు అమ్మిందో తెలుసా.?  

Samantha Sells Vegetables At The Market-

సమంత…పరిచయం అక్కర్లేని పేరు.ఏం మాయ చేసావేతో కుర్రాళ్ళ హృదయాలకి గేలం వేసింది.గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది.సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది..

Samantha Sells Vegetables At The Market--Samantha Sells Vegetables At The Market-

ఆమె సినిమాలు వదిలేస్తుంది అని ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది.కానీ అది అవాస్తవం అని స్పందించింది సమంత.టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.

చైతన్య సమంత ల లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కదా.ఇది ఇలా ఉంటె సమంత ట్విట్టర్ లో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.ఒక పక్క ప్రత్యూష ఫౌండేషన్ తో పిల్లలకి సహాయం చేస్తూనే మరోపక్క ఫన్నీ కౌంటర్ లు కూడా వేస్తుంది.

ఇప్పుడు అసలు కథ ఏంటంటే.?

న‌టిగానే కాదు, సేవా దృక్ప‌థంతో అంద‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్న అందాల భామ సమంత‌.పెళ్ళికి ముందు నుండే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థని స్థాపించింది.దీని ద్వారా ఎంతో మంది అనాధ‌ల‌కి అండ‌గా ఉంటుంది స‌మంత.

గ‌తంలో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు.దుస్తుల్ని వేలం వేసిన స‌మంత‌ ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది..

ఇక త‌న పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేష‌న్‌కి అందజేసింద‌నే టాక్ న‌డిచింది.

ఇటీవల ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆర్గనైజింగ్ కార్యక్రమంలో స్వయంగా కూరగాయలు అమ్మింది సమంత.ఈ మొత్తాన్ని మానసిక వికలాంగులైన చిన్నారులకు, అనేక వ్యాధులబారిన పడి ఇబ్బంది పడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్టు సామ్ తెలిపింది.

ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సామ్ మంచి మనసును అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.