సమంత నిర్ణయాన్ని తప్పుబడుతున్న అభిమానులు

పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అందరిలాగే పెళ్లి అవ్వగానే ఎందుకు పద్దతిగా నటించేందుకు సమంత ప్రయత్నిస్తుంది అంటూ కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

 Samantha Says No To Raghavendra Rao, Raghavendra Rao, Ramya Krishna, Samantha,-TeluguStop.com

ఈ సమయంలోనే సమంత యొక్క మరో నిర్ణయాన్ని కూడా అభిమానులు తప్పుబడుతున్నారు.ఇటీవల ఈమె ను ఒక సినిమా కోసం ప్రముఖ నటుడు కమ్‌ డైరెక్టర్‌ తనికెళ్ల భరణి సంప్రదించాడట.

మొదట నటించేందుకు ఓకే చెప్పిన సమంత ముగ్గురు హీరోయిన్స్‌ తో కలిసి నటించడంతో పాటు రాఘవేంద్ర రావుతో కొన్ని క్లోజ్‌ సీన్స్‌ ఉన్న కారణంగా ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందట.ఈ విషయంలో ఆమెను కొందరు తప్పుబడుతున్నట్లుగా తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో సమంత రాఘవేంద్ర రావుతో రొమాన్స్‌ కు నో చెప్పి సినిమా నుండి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అందులో ఏమాత్రం నిజం లేదు.కాని సమంత ఆ సినిమాను వదిలేసిన మాట వాస్తవం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కథ మరియు ఇతర విషయాల్లో సంతృప్తి చెందినా కూడా డేట్ల విషయంలో ఏమైనా సమస్య వచ్చి ఉంటుందేమో అంటూ కొందరు అంటున్నారు.

కాని రాఘవేంద్ర రావు సినిమాను సమంత కాదనడం మాత్రం ఏ ఒక్కరు ఒప్పుకోడం లేదు.ఖచ్చితంగా ఆయన తో సినిమా చేస్తేనే సమంతకు గౌరవం అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

సమంత ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేస్తున్నదే లేదు.అలాంటప్పుడు రాఘవేంద్ర రావుకు సినిమా ఎందుకు నో చెప్పలేదు అంటున్నారు.

రాఘవేంద్ర రావు సినిమాలో సమంత ప్లేస్‌ లో తమన్నాను నటింపజేసే అవకాశం ఉంది.ఆమె మాత్రమే కాకుండా రమ్యకృష్ణ, శ్రియ మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నారు.

త్వరలో సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube