ఓ స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పిన సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈమద్య కాలంలో సినిమాలపై ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లుగా అనిపించడం లేదు.ఎందుకంటే ఆమె ఎక్కువగా వ్యాపారం మరియు టాక్‌ షోలపై దృష్టి పెడుతోంది.

 Samantha Says No To A Big Hero, Lady Oriented Movie, Samantha Collywood Movies,-TeluguStop.com

ఒక వేళ హీరోయిన్‌గా నటించేందుకు ఆసక్తి చూపించినా కూడా ఆమెకు ఎక్కువగా కమర్షియల్‌ మూవీల్లో నటించాలనే ఆసక్తి లేదట.ఈ విషయంలో ఆమె చాలా క్లారిటీగా ఉంది.

తనకు ఇకపై కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలు.హీరోల పక్కన డాన్స్‌ మరియు రొమాన్స్‌ కు సిద్దం అయ్యే పాత్రలకు సంప్రదించవద్దంటూ విజ్ఞప్తి చేసింది.

ఇటీవల ఒక దర్శకుడు సమంతను కలిశాడు.ఆయన కథ చెప్పేందుకు అనుమతి కోరగా స్టార్ హీరో మూవీ అని తెలిసి పాత్ర విషయమై క్లారిటీ తీసుకుంది.

హీరోకు జోడీగా ఒక సాదా సీదా పాత్రలో హీరోయిన్‌ కనిపిస్తుంది.కనుక అలాంటి పాత్రలు చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది.

Telugu Ott Show, Samantha, Telugu, Web-Latest News - Telugu

సమంత నో చెప్పిన ఆ హీరో ఎవరు అనే విషయం పక్కన పెడితే కమర్షియల్‌ సినిమాలకు నో చెప్పిన సమంత మరి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు అయినా వరుసగా ఓకే చెప్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఏర్పాట్లు అయితే ఏమీ జరుగుతున్నట్లుగా లేవు.తమిళంలో ఈమె ఆమద్య ఒక సినిమాకు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి.కాని అక్కడ ఈమె చేస్తున్న సినిమా కూడా ఏది మొదలు కాలేదు.దాంతో సమంత కొత్త సినిమాల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందో అర్థం అవ్వడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ అమ్మడి సినిమాలు వరుసగా రావడం లేదు.

ఆ విషయంలో ప్రతి ఒక్కరు నిరాశను వ్యక్తంచేస్తున్నారు.అభిమానులకు ఈమె నుండి వస్తున్న కొత్త సినిమా ఏంటా అంటూ ఆసక్తిగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube