తప్పుదిద్దుకున్న సమంత.. సూపర్ అంటున్న ప్రేక్షకులు..?  

అందం, అభినయం పుష్కలంగా ఉన్న సమంత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా వెబ్ సిరీస్ లలో చేస్తూ, టాక్ షోలను హోస్ట్ చేస్తూ వేర్వేరు రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారు.

TeluguStop.com - Samantha Sam Jam Second Episode Got Amazing Response From Audience

దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ షోను హోస్ట్ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న సమంత ఆ తరువాత ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు.

TeluguStop.com - తప్పుదిద్దుకున్న సమంత.. సూపర్ అంటున్న ప్రేక్షకులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.సామ్ జామ్ షో కిచిడిలా ఉందని కొందరు సమంతను ట్రోల్ చేశారు.

మరి కొంతమంది సామ్ జామ్ షో బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ ను తలపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే తొలి ఎపిసోడ్ కు వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని టాక్ షోలో కీలక మార్పులు చేశారు.

రెండో ఎపిసోడ్ కు రానా గెస్ట్ గా హాజరు కాగా ఈ ఎపిసోడ్ లో సమంత ఆకట్టుకుంది.ఫస్ట్ ఎపిసోడ్ లో ఎదురైన విమర్శలన్నింటిని రెండో ఎపిసోడ్ కు సరిదిద్దుకుంది.

దీంతో రెండో ఎపిసోడ్ బాగుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.సామ్ జామ్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కోరుకుంటున్నామని ఇదే విధంగా మిగిలిన ఎపిసోడ్లను కూడా కొనసాగిస్తే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

రానా, నాగ్ అశ్విన్ లు హాజరైన రెండో ఎపిసోడ్ లో ఎక్కడా బోరింగ్ గా ఫీల్ కాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు.ఈ షోలో రానా తన ఆరోగ్య సమస్యలను వివరించిన తీరు చూసి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రానాకు ఇన్ని బాధలున్నాయా.? అని ప్రేక్షకులు కామెంట్లు చేస్తారు

.

#Rana #Nag Aswin #SamJam #AmazingResponse

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Sam Jam Second Episode Got Amazing Response From Audience Related Telugu News,Photos/Pics,Images..