సామ్‌ జామ్‌ సీజన్‌ 2 పై ఆహా టీం కామెంట్స్‌

తెలుగు ఓటీటీ ఆహా కంటెంట్ విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది.భారీ సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలను వెబ్ సిరీస్‌ లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

 Samantha Sam Jam Season 2 Update From Aha Ott Team , Telugu Ott Aha, Web Series,-TeluguStop.com

ఈ సమయంలోనే టాక్‌ షోలను కూడా ఆహా వారు తీసుకు వచ్చారు. సుమ మరియు వైవా హర్ష ల టాక్ షో లను నిర్వహించిన ఆహా వారు ఆ తర్వాత సమంత తో సామ్‌ జామ్‌ అనే భారీ టాక్ షో ను ప్లాన్‌ చేశారు.

ఇప్పటికే ఏడు ఎపిసోడ్‌ లు స్ట్రీమింగ్ పూర్తి అయిన సామ్‌ జామ్ నాగచైతన్య తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చైతూ ఎపిసోడ్‌ తో సీజన్‌ 1 కు ముగింపు పలక బోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక సామ్‌ జామ్‌ సీజన్‌ 2 ఎప్పుడు అనే విషయమై ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆహా టీమ్‌ వారు ఆసక్తిక వ్యాఖ్యలు అనధికారికంగా చేస్తున్నారు.

Telugu Aha Ott, Allu Arjun, Chiranjeevi, Nagachaitanya, Sam Jam, Samantha, Shows

సామ్ జామ్‌ టీం మరీ ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండా రెండవ సీజన్ ను ప్రేక్షకుల మందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారట.అయితే వచ్చే సీజన్ మరింత ఎంటర్‌టైన్‌ మెంట్‌ తో ఉంటుందని అంటున్నారు.సామ్‌ జామ్ టాక్ షో సీజన్‌ 2 మే లో ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా సీనియర్ హీరోలను ఇతర స్టార్స్ ను తీసుకు రావడం ఇబ్బంది గా ఉంది.అందుకే కరోనా భయం పోయిన తర్వాత ఈ కార్యక్రమంను మళ్లీ పునః ప్రారంభిస్తాం అంటూ ప్రకటించారు.

మొదటి సీజన్‌ ను 10 ఎపిసోడ్‌ లకు అనుకున్నాం.కాని కేవలం 8 ఎపిసోడ్‌ లతో మాత్రమే ముగిసింది.

కాని రెండవ సీజన్ మాత్రం ఖచ్చితంగా 10 ఎపిసోడ్ లకు మించి ఉంటుందని అలాగే ఈసారి దర్శకులు హీరోయిన్‌ లను మరియు స్టార్‌ హీరోలను తీసుకు వస్తాం అంటూ టీం చెబుతున్నారు.సమంత ఈ సీజన్ కు 15 లక్షలు ఎపిసోడ్‌ కు చొప్పున తీసుకుంది.

వచ్చే సీజన్‌ పారితోషికం ఎంత ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube