కథానాయికలకి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్ ఫామ్ దొరికింది అంటున్న సమంత

ఒకప్పుడు సౌత్ లో హీరోయిన్స్ అంటే కేవలం కమర్షియల్ సినిమాలలో పాటలకి, హీరోతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకి మాత్రమే పరిమితం అనే విధంగా ఉండేవారు.దర్శకులు కూడా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ని తీసుకున్న వారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన నాలుగు, ఐదు పాటలు ఓ నాలుగు సన్నివేశాలకి మాత్రమే వారిని పరిమితం చేసేవారు.

 Samantha Said Heroines Have Lot Of Chance To Show Their Talents, Tollywood, Telu-TeluguStop.com

పేరుకే కమర్షియల్ స్టార్ హీరోయిన్ తప్ప నటించడానికి వారికి ఎలాంటి స్కోప్ ఉండేది కాదు.ఈ విషయంలో చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే తమ అసహనం వ్యక్తం చేస్తారు.

తెలుగు సినిమాలలో హీరోయిన్ పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని కేవలం హీరోయిన్ అంటే అందాల ప్రదర్శన కోసం ఉన్న షో పీస్ మాత్రమే అని కామెంట్స్ కూడా చేశారు.అయితే మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల టెస్ట్ మారింది.

అలాగే దర్శకుల ఆలోచనలో మార్పులు వచ్చాయి.హీరోయిన్ పాత్రలకి ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది.

ఏవో కొన్ని కమర్షియల్ సినిమాలు తప్ప చాలా వరకు ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ పాత్రలకి ప్రాధాన్యత ఉంటుంది.

Telugu Telugu, Tollywood, Web-Latest News - Telugu

ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్లుకి తమ టాలెంట్ చూపించుకోవడానికే మరో ప్లాట్ ఫామ్ కూడా దొరికింది.సినిమాలలో సరైన అవకాశాలు రావడం లేదని ఫీల్ అయ్యేవారికి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వేదికగా మారింది.వారిని వారు ప్రూవ్ చేసుకోవడానికి వెబ్ సిరీస్ ల ద్వారా స్కోప్ దొరికింది.

ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత కూడా చెప్పింది.ఒకప్పటిలా ప్రస్తుతం పరిశ్రమ లేదని కథానాయికలకు తమ టాలెంట్ చూపించుకోవడానికే కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

విభిన్న పాత్రలలో తమని తాము ఆవిష్కరించుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పింది.ప్రస్తుతం తాను ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో ఇది వరకు ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూస్తారని, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తాను కనిపిస్తానని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube