నన్ను, నా క్యారెక్టర్ ను దారుణంగా కించపరిచారు.. పిటిషన్ లో సమంత ఆవేదన ఇదే?

Samantha Ruth Prabhu Files Defamation Lawsuites Against Three Youtube Channels

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.మూడు యూట్యూబ్ ఛానెళ్లతో పాటు సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తిపై సమంత పరువునష్టం దావా వేశారు.

 Samantha Ruth Prabhu Files Defamation Lawsuites Against Three Youtube Channels-TeluguStop.com

విడిపోయిన సమయంలో రూమర్లు సృష్టించవద్దని, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని సమంత సోషల్ మీడియా వేదికగా కోరినప్పటికీ ఆమె గురించి తప్పుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే సమంత పిటిషన్ లో తెలుగులో తాను పాపులర్ నటినని తనపై జరుగుతున్న దుష్ప్రచారం ఆపాలనే ఉద్దేశంతోనే పిటిషన్ ను దాఖలు చేశానని సమంత పేర్కొన్నారు.45 సినిమాలలో తాను నటించానని తన నటనకు 12 అవార్డులు వచ్చాయని సమంత వెల్లడించారు.తాను ప్రస్తుతం 12 ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానని సమంత పేర్కొన్నారు.

 Samantha Ruth Prabhu Files Defamation Lawsuites Against Three Youtube Channels-నన్ను, నా క్యారెక్టర్ ను దారుణంగా కించపరిచారు.. పిటిషన్ లో సమంత ఆవేదన ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని అయితే కొందరు తనను కించపరుస్తున్నారని సమంత చెప్పుకొచ్చారు.

Telugu Samantha, Tollywood-Movie

తనను, తన క్యారెక్టర్ ను కించపరచడంతో పాటు తన పరువును బజారుకు ఈడుస్తున్నారని సమంత పిటిషన్ లో వెల్లడించారు.తాను అబద్ధాలు చెబుతున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతమ్ తో తనకు సంబంధం ఉందని ప్రచారం చేశారని సమంత పిటిషన్ లో వెల్లడించారు.తన డ్రెస్సింగ్ గురించి వీడియోలు చేసి కించపరిచారని సమంత చెప్పుకొచ్చారు.

తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని పక్కా ప్రణాళికతోనే ఈ విధంగా చేశారని సామ్ పేర్కొన్నారు.యూట్యూబ్ ఛానెళ్లతో వీడియో లింక్స్ తొలగించడంతో పాటు పబ్లిక్ గా క్షమాపణలు చెప్పించాలని సామ్ కోరారు.తనపై దుష్ప్రచారం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో సమంత కోరారు.సమంత పిటిషన్ విషయంలో కోర్టు ఏ విధంగా స్పందింస్తుందో చూడాల్సి ఉంది.

#Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube