కొత్తగా అది నేర్చుకుంటున్న సమంత... ఇది ఆరంభం అంటూ పోస్ట్!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.

 Samantha Ruth Prabhu Do Skiing At James Grant Samantha, Tollywood, Viral Video, Social Media, Nagacahitanya, Switzerland‌-TeluguStop.com

సమంత అక్కడికి ఎందుకు వెళ్ళింది అన్నది మాత్రం తెలియదు.కానీ అక్కడకొత్తగా విన్యాసాలు చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తోంది.

మంచుకొండల్లో సమంత కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటోంది.దీనికి సంబంధించిన వీడియోలు కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 Samantha Ruth Prabhu Do Skiing At James Grant Samantha, Tollywood, Viral Video, Social Media, Nagacahitanya, Switzerland‌-కొత్తగా అది నేర్చుకుంటున్న సమంత#8230; ఇది ఆరంభం అంటూ పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విడాకుల వ్యవహారం తర్వాత సమంత కు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఏదో ఒక విషయంలో సమంతా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా తన విడాకుల ప్రకటన గురించి సమంత తన ఇంస్టాగ్రామ్ లో డిలీట్ చేయడంతో కొత్త కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.ఇద్దరు కలిసి పోతున్నారా? విడాకులు రద్దు చేసుకుంటున్నారా?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కానీ సమంత మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన పాటికి తాను ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత స్విస్‌లో స్కింగ్ ఆనే ఆటను ఆడుతోంది.

మంచు రహదారిలో అలా దూసుకుపోతోంది.స్కేటింగ్ చేసినట్టుగా సమంత రాకెట్ స్పీడ్‌తో దుమ్ములేపుతోంది.ఈ వీడియోను షేర్ చేస్తూ.ఈగోను ఇంటి వద్దే వదిలేసి రండి అని వారు చెప్పారు.ఎంత కరెక్ట్ మాటలు చెప్పారో కదా? అంటూ సమంత షేర్ చేసింది.ఇక న్యూ బిగినింగ్స్ స్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో సమంత షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ఆ బాధను మరిచిపోవడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, మరొక వైపు తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారింది ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube