సంగీత దర్శకుడితో సమంత రొమాన్స్‌

తెలుగు, తమిళంలో పలు సినిమాలకు సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్‌ కుమార్‌ తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఈయన హీరోగా దర్శక ద్వయం గుణ, శంకర్‌లు ‘బ్రూస్‌లీ’ అనే సినిమాను మొదలు పెట్టబోతున్నారు.

 Samantha To Romance Music Composer Gv Prakash-TeluguStop.com

తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని వారు భావిస్తున్నారు.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఆ సినిమాను త్వరలోనే సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

తమిళంతో పాటు తెలుగులో కూడా ‘బ్రూస్‌లీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఫేమస్‌ హీరోయిన్‌ను తమ సినిమాలో హీరోయిన్‌గా బుక్‌ చేసుకుంటే మంచి ఫలితం వస్తుందనే ఉద్దేశ్యంతో శంకర్‌, గుణలు ఈ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక వైపు స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న సమంత ఇలా చిన్న హీరోలకు సైతం ఓకే చెబుతూ ఉంది.అయితే చిన్న హీరోల సరసన నటించేందుకు ఈమె భారీ స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటుంది.

తెలుగులో సమంత వల్ల జీవీ ప్రకాష్‌కు ఎంట్రీ దొరుకుతుందేమో చూడాలి.తెలుగులో ఇటీవలే ఈమె ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఎంపిక అయ్యింది.

అలాగే నితిన్‌, త్రివిక్రమ్‌ మూవీలో సైతం సమంతను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube