చైతూ కోసం సమంత మాట సాయం... దిల్‌ రాజు ఓకే అన్నాడట  

  • టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ’96’ చిత్రం రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు. మొదట ఈ చిత్రం రీమేక్‌లో సమంత నటించేందుకు ఆసక్తి చూపించలేదు. కాని దిల్‌ రాజు ఒకటికి రెండు సార్లు సినిమా స్క్రిప్ట్‌ను సమంతకు వినిపించి, చివరకు ఒప్పించాడు. శర్వానంద్‌ హీరోగా సమంత హీరోయిన్‌గా ఈ రీమేక్‌ త్వరలోనే పట్టాలెక్కబోతుంది.

  • Samantha Request To Dil Raju About Naga Chaitanya-Dil And Nagachaitanya Combo Naga Chaitanya Samanta Next Movie

    Samantha Request To Dil Raju About Naga Chaitanya

  • సమంత హీరోయిన్‌గా ఈ రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఇక ఈ చిత్రంలో నటించినందుకు గాను సమంత దిల్‌రాజు వద్ద ఒక ప్రపోజల్‌ ఉంచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన భర్త నాగచైతన్య సినీ కెరీర్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ ఫుల్‌గా లేదు. అందుకే ఆయనతో ఒక సినిమాను నిర్మించాల్సిందిగా దిల్‌రాజుతో సమంత చెప్పిందని, అందుకు దిల్‌రాజు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమద్య గల్లా జయదేవ్‌ తనయుడు గల్లా అశోక్‌తో మొదలు పెట్టిన సినిమాను నాగచైతన్యతో చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

  • Samantha Request To Dil Raju About Naga Chaitanya-Dil And Nagachaitanya Combo Naga Chaitanya Samanta Next Movie
  • నాగచైతన్య మొదటి సినిమా జోష్‌ను దిల్‌రాజు నిర్మించాడు. ఆ సినిమాలో దిల్‌రాజు ఒక పాట కూడా పాటడం జరిగింది. ఆ సినిమా నాగచైతన్య కెరీర్‌కు తప్పకుండా మంచి బూస్ట్‌ ఇస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో నాగచైతన్య మళ్లీ ఎప్పుడు కూడా దిల్‌రాజు బ్యానర్‌లో నటించలేదు. దిల్‌రాజుకు ప్రస్తుతం మంచి సక్సెస్‌ ట్రాక్‌ ఉంది. ఆ కారణంగానే ఆయన బ్యానర్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు నాగచైతన్య కూడా ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే దిల్‌రాజు బ్యానర్‌లో నాగచైతన్య మూవీ రాబోతుంది.