ఆడపిల్ల పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు అలా చేయాలని అంటున్న సామ్...

Samantha Reply To The Netizen Question

తెలుగులో “ఏ మాయ చేశావే” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ “సమంత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటి సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 Samantha Reply To The Netizen Question-TeluguStop.com

ఈ మధ్య సమంత కొంతమేర సినిమా షూటింగులకు బ్రేక్ తీసుకొని తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.

కాగా తాజాగా సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇంతకీ ఆ స్టోరీ ఏమిటంటే ఓ మహిళ తన కూతురు గురించి చెబుతూ మై మామ్ సెడ్ కి ట్యాగ్ చేసింది.

 Samantha Reply To The Netizen Question-ఆడపిల్ల పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు అలా చేయాలని అంటున్న సామ్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సమంత ఈ విషయంపై స్పందిస్తూ మీ కూతురు కి పెళ్లి చేసేందుకు కాకుండా తన జీవితంలో తన కాళ్ళపై తాను నిలబడే విధంగా సిద్ధం చేయాలని సూచించింది.అంతేకాక ఆడపిల్లకి పెళ్లి చేసేందుకు కాకుండా ఆమెను చదివించేందుకు డబ్బు ఖర్చు పెట్టాలని అలాగే ప్రేమ, అనురాగాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వంటివాటి గురించి నేర్పించాలని కూడా సూచించింది.

దీంతో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఆడపిల్ల జీవితంలో పెళ్లి ఒక్కటే ముఖ్యం కాదని చదువు మరియు తన కుటుంబాన్ని పోషించేటువంటి శక్తి వంటివి కూడా చాలా ముఖ్యమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu Akkineni Naga Chaithanya, Divorce Issue, My Mom Said, Samantha, Samantha Reply To The Netizen Question, Tollywood, Women Marriage-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సమంత తెలుగులో దాదాపుగా రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే 20 శాతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.అయితే వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగును నిలిపి వేయడంతో ఈ చిత్ర విడుదల విషయంలో కొంతమేర సందిగ్దత నెలకొంది.

#Divorce #SamanthaReply #Mom #Samantha #AkkineniNaga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube