సమంత అంటే తెలియని వారు ఉండరేమో.తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అంతేకాదు టాలీవుడ్ లోనే పెద్ద కుటుంబం అయినా అక్కినేని కోడలుగా చైతూకు భార్య గా సమంత మరింత గౌరవం దక్కించుకుంది.
అయితే ఇంతటి పేరు, స్టార్ డమ్ ఇవేమి ఎంతో కాలం నిలవలేక పోయింది.

ఎంతో అన్యోన్యంగా ఉండే జంట విడాకులు తీసుకోవడం అభిమానులకు ఇప్పటికి జీర్ణించుకోలేని విషయం.గత కొన్ని రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చినప్పటికీ అభిమానులు మాత్రం ఎక్కడో చిన్న ఆశ అయితే పెట్టుకున్నారు.వీరిద్దరూ విడిపోతున్నారంటే మాత్రం అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ లో ఉన్న వారు కూడా షాక్ అవుతున్నారు.
అయితే ఎన్నో రోజులుగా నానుతున్న ఈ విషయంపై నిన్న అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అన్ని రూమర్స్ కు చెక్ పెట్టారు.అసలు ఈ రూమర్ ఎక్కడ మొదలయ్యిందో అందరికి తెలిసిన విషయమే.
సమంత తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని సమంత అనే పేరును తొలగించి S అనే లెటర్ పెట్టడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.అయితే ఇప్పుడు ఆ S అనే అక్షరాన్ని కూడా తొలగించి మరొక పేరును పెట్టుకుంది.

ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో S అనే పేరును కూడా తొలగించి సమంత అనే పేరును పెట్టుకుంది.నిన్న అధికారికంగా తన విడాకుల విషయాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు తన పేరును సమంత గా మార్చుకుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోతున్నారనే విషయాన్నీ మాత్రం ఇంకా జీర్ణించుకోక తప్పదు.ఎవరిదీ తప్పు ఎవరిదీ ఒప్పు అని మనం చర్చించు కోవడం కూడా తప్పు.
ఎందుకంటే ఇది వారి పర్సనల్ విషయం కాబట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు.