నాగార్జున పుట్టిన రోజు సీడీపీ... సమంత ప్రత్యేక శ్రద్ధ

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సీడీపీ ట్రెండ్ వచ్చింది.స్టార్ హీరోలు నటించిన అన్ని సినిమాలలోని పాత్రలని తీసుకొని ఒకే పోస్టర్ తయారు చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ కి అలవాటుగా మారింది.

 Samantha Released Nagarjuna Birthday Cdp, Akkineni Fans, Tollywood, King Nagarju-TeluguStop.com

ఈ సీడీపీలతో హీరోల ఫ్యాన్స్ మధ్య మంచి పోటీ కూడా ఉంటుంది.సోషల్ మీడియాలో సీడీపీ పోస్ట్ చేసి, దానిని బర్త్ డే హ్యాష్ ట్యాగ్ తో ఎంత ఎక్కువ ట్రెండ్ చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన సీడీపీ, హ్యాష్ ట్యాగ్ తో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ స్పెషల్ డిస్ ప్లే, హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఆ రికార్డుని బ్రేక్ చేశారు.

ఈ సీడీపీల విషయంలో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కొద్దిగా వార్ నడిచింది.ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా కూడా స్పెషన్ సీడీపీని డిజైన్ చేసి తయారు చేసి మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పుట్టిన రోజుకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే స్పెషన్ డీపీ సందడి మొదలైంది.సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ హడావుడి ప్రారంభించారు.

స్టార్ హీరోయిన్ సమంత తన మామ నాగ్ సీడీపీని దగ్గరుండి తయారు చేయించి విడుదల చేసింది.దీన్ని విడుదల చేయడం తనకు దక్కిన గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఆయనపై తనకెంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని, అవి ఎప్పటికి అలాగే నిలిచి ఉంటాయని పేర్కొంది.ఈ సీడీపీని చూసిన ఫ్యాన్స్ అంతా సమంతను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ఇక ఈ డిస్ ప్లే పిక్చర్ లో నాగ్ నటించిన పలు చిత్రాల్లోని స్టిల్స్ ఉన్నాయి.ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ స్పెషల్ డీపీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి నాగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube