సమంతకు అసలేం అయ్యింది? ఇలా ఎందుకు చేస్తుంది?  

  • టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత సంవత్సరం అక్కినేని హీరో నాగచైతన్యనను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. నాగచైతన్యతో వివాహం అయిన తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగాలని భావించింది. పలు సందర్బాల్లో తనకు సినిమాలు అంటే ఇష్టం, తప్పకుండా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. నాగచైతన్య కూడా సమంత సినిమాల్లో తప్పకుండా నటిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. కాని గత కొన్నాళ్లుగా సమంత కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ ఒప్పుకోవడం లేదు. స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా నటించేందుకు సమంత ఆసక్తి చూపడం లేదు.

  • ‘బాహుబలి’ వంటి దేశం గర్వించదగ్గ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో చిన్న పాత్రలో నటించేందుకు అయినా స్టార్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తారు. జక్కన్న సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లి పోయినా పర్వాలేదు అనుకునే వారు ఎంతో మంది ఉంటారు. ఇక స్టార్స్‌కు జక్కన్నతో సినిమా చేసే అవకాశం రేర్‌గా వస్తుంది. అది సమంతకు మరోసారి దక్కింది. ఈగ చిత్రం కోసం జక్కన్నతో కలిసి వర్క్‌ చేసి, స్టార్‌డంను దక్కించుకున్న సమంత తాజాగా మరోసారి జక్కన్న మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది.

  • Samantha Rejected Rajamouli Offer Why-

    Samantha Rejected Rajamouli Offer Why

  • ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ పాత్రలకు ఎంపిక జరుగుతుంది. ఇప్పటి వరకు పలువురి పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. అయితే తాజాగా జక్కన్న సన్నిహితులు సమంతను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆర్‌ మల్టీస్టారర్‌లో నటించాలంటూ ఆమెను కోరడం జరిగిందట, అందుకు సమంత సున్నితంగా తిరష్కరించిందని తెలుస్తోంది. స్వయంగా రాజమౌళికి సారీ అంటూ మెసేజ్‌ పెట్టి, ఎందుకు నటించలేక పోతున్నాను అనే విషయాన్ని చెప్పలేక పోతున్నాను అంటూ మెసేజ్‌ చేసిందట.

  • ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో విపరీతంగా టాక్‌ వినిపిస్తుంది. సమంత ఎందుకు ఇలాంటి బిగ్‌ ఆఫర్‌ను వదులుకుంది. అసలు సమంత ఇతర హీరోల సినిమాల్లో కూడా ఎందుకు నటించడం లేదు, సమంత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనుకుంటుందా లేదంటే బ్రేక్‌ తీసుకోవాలనుకుంటుందా అంటూ సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సమంత నటించిన యూటర్న్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం తర్వాత సమంత చేతిలో ఏమీ లేవు. మరి సమంత ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.