సమంత బట్టల వ్యాపారానికి భలే గిరాకీ ఉంది

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఈ సామెత ఈ జెనరేషన్ హీరోయిన్స్ కి కరెక్ట్ గా వర్తిస్తుంది.

 Samantha Receiving Huge Profits With Business, Tollywood, Shaakunthalam Movie, S-TeluguStop.com

ఒకప్పుడు కథానాయికలు అంటే తల్లిచాటు బిడ్డలే.వాళ్ళ రెమ్యునరేషన్, డేట్స్, సంపాదన అంతా తల్లిదండ్రులే చూసుకునేవారు.

దీంతో చాలా మంది హీరోయిన్స్ కి తాము ఎంత సంపాదిస్తున్నామో కూడా తెలియకుండా పోయింది.ఒకానొక దశలో కెరియర్ లో అవకాశాలు తగ్గిపోయాక ఇక తల్లిదండ్రులు చూసిన వారిని పెళ్లి చేసుకొని సాధారణ గృహిణిలా జీవితాన్ని కొనసాగించడమే అప్పటి హీరోయిన్స్ చేశారు.

అయితే ఈ జెనరేషన్ హీరోయిన్స్ మాత్రం సక్సెస్ లో ఉన్నప్పుడు తాము సంపాదించిన ప్రతి పైసా తామే భద్రం చేసుకుంటున్నారు.తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ రెమ్యునరేషన్, తమ సినిమాల డేట్స్ కూడా తామే చూసుకుంటున్నారు.

అవసరం అయితే ఒక మేనేజర్ ని జీతం ఇచ్చి పెట్టుకుంటున్నారు.ఈ నేపధ్యంలో తాము ఎంత సంపాదిస్తున్నాం అనే విషయం మీద నేటి కథానాయికలకి స్పష్టమైన అవగాహనా ఉంది.

ఇక సంపాదించిన సొమ్ముని అనవసరమైన ఖర్చులు చేయకుండా వేరొక చోట పెట్టుబడిగా పెడుతున్నారు.రకరకాల వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు.ఇండిపెండెంట్ గా బ్రతకడానికి కావాల్సిన భద్రతని పెంచుకుంటున్నారు.ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లలో చాలా మందికి సొంత వ్యాపారాలు ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ సమంత కూడా సాకీ అనే ఒక ఆన్ లైన్ ఫాషన్ స్టోర్ ని స్టార్ట్ చేసింది.తన ఫాషన్ దుస్తులకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రమోట్ చేస్తుంది.

దీంతో సమంతకి ఉన్న క్రేజ్ కారణంగా సాకీ ఫాషన్ స్టోర్ కి ఫుల్ గిరాకీ ఉంది.ఆన్ లైన్ కాబట్టి కేవలం ఒక ప్రాంతానికి దేశానికి అనే అడ్డులేకుండా, విదేశాల నుండి సైతం సాకీ స్టోర్ కి ఆర్డర్స్ వస్తున్నాయి.

ఈ విషయాన్ని సమంతా తాజాగా వీడియో పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది.ఈ విషయం తెలుసా? సాకీ స్టోర్ దుస్తులను అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు కూడా పంపిస్తున్నాం అంటూ పోస్టులో చెప్పుకొచ్చింది.అదే సమయంలో సామ్ వీడియోలో అద్దం ముందు నిలబడి చకచకా దుస్తులు మార్చుకుంటూ కనిపించింది.మొత్తానికి సాకీ స్టోర్ ని సమంత భాగా ప్రమోట్ చేస్తూ మంచి లాభాలు గడిస్తుందని ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube