నీవు ఇలాగే చేస్తే ఆంటీ నన్ను తిట్టేస్తారంటున్న సమంత

సెలబ్రెటీని అభిమానిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం చాలా మంది చేస్తూ ఉంటారు.ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్‌ కోసం ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చెవులు కోసుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి.

 Samantha React On Social Media Comment About His Fan-TeluguStop.com

ఇప్పుడు సమంత విషయం ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.సమంత ఫ్యాన్‌ ఒకతను తన నోట్‌ బుక్‌లో ఐలవ్‌ యూ సమంత అంటూ కొన్ని వందల సార్లు రాయడం జరిగింది.

ఆ అభిమాని ఆ నోట్‌ బుక్‌ను వీడియో తీసి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Telugu Samantha, Samantha Active, Samanthafan, Samantha Latest, Samanthareact-Mo

ఇలా రాసేందుకు మూడు గంటల సమయం పట్టింది.ఆ సమయంలో నన్ను పదే పదే అమ్మ తిడుతున్నా కూడా వదిలి పెట్టకుండా నేను దీన్ని పూర్తి చేశాను అంటూ అతడు పోస్ట్‌ చేశాడు.సమంత ఫ్యాన్‌ చేసిన వీడియోకు రియాక్ట్‌ అయ్యింది.

మీరు ఇలా చేయడం నాకు సంతోసంగా ఉంది.కాని మీరు ఇలా చేసినందుకు మీ అమ్మగారు నన్ను ఎంతగా తిడుతుందో కదా అంటూ సమంత సరదా కామెంట్‌ పెట్టింది.

ఇదే సమయంలో మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూనే బాగా చదువుకోవాలంటూ సమంత అభిమానికి సలహా ఇచ్చింది.

Telugu Samantha, Samantha Active, Samanthafan, Samantha Latest, Samanthareact-Mo

సమంత హీరోయిన్‌గా ప్రస్తుతం జాను చిత్రంలో నటిస్తుంది.చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.96 చిత్రంలో త్రిష పోషించిన పాత్రను తెలుగులో సమంత పోషించింది.జానుగా ఈ చిత్రంతో సమంత ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube