అక్కచెల్లెళ్ళుగా నటించనున్న సమంత, రష్మిక మందన  

Samantha and Rashmika Play Sisters Roles in New Movie, Tollywood, Telugu Cinema, Samantha, Rashmika mandana - Telugu Rashmika Mandana, Samantha, Samantha And Rashmika Play Sisters Roles In New Movie, Telugu Cinema, Tollywood

ఏకంగా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన ముద్దుగుమ్మ సమంత.ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో సుమారు స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది.

TeluguStop.com - Samantha Rashmika Sisters Roles Rangasthalam Vijay Sethupathi Vignesh Shivan

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పెళ్లి తర్వాత కూడా రంగస్థలం, అభిమాన్యుడు, విజయ్ తో ఒక సినిమా చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తన ఇమేజ్ ని కొనసాగిస్తుంది.ప్రస్తుతం విజయ్ సేతుపతికి జోడీగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సమంత ఒక సినిమా చేస్తుంది.

TeluguStop.com - అక్కచెల్లెళ్ళుగా నటించనున్న సమంత, రష్మిక మందన-Movie-Telugu Tollywood Photo Image

మరో వైపు ఈ అమ్మడు సోలో గా హిట్స్ కొట్టేందుకు లేడీ ఒరియాంటెడ్ కథలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది.మలయాళీ హిట్ మూవీ హెలెన్ సినిమాని రీమేక్ చేయడానికి సమంత ప్లాన్ చేస్తుంది.

ఇదిలా ఉంటే చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తరువాత వరుస హిట్స్ తో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించేందుకు సిద్ధం అవుతున్న కన్నడ భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తుంది.

***

దాంతో పాటు కార్తితో ఓ తమిళ సినిమాలో జత కట్టబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది.

తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్లుకి సంబంధించి ఒక కథ సిద్ధం చేసుకొని ఇటీవల ఈ ఇద్దరు భామలకి ఫోన్ లో నేరేట్ చేయడం జరిందని, అందులో వారిద్దరు నటించడానికి ఒకే చెప్పారని టాక్ వినిపిస్తుంది.

సినిమాలో ఇద్దరి పాత్రలకి సమ ప్రాధాన్యత ఉంటాయని, కథ ఆరంభం నుంచి చివరి వరకు ఈ రెండు పాత్రల చుట్టూనే కథ కడుస్తుందని చెప్పుకుంటున్నారు.ఓ ప్రముఖ నిర్మాత సంస్థ ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకి వచ్చినట్లు సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుంది.మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో లేడీ ఒరియాంటెడ్ సినిమా అంటే కాస్తా ఆసక్తికరంగానే ఉంటుంది.

మరి ఈ సినిమా ఎంత వరకు వాస్తవరూపం దాల్చుతుంది అనేది వేచి చూడాలి.

#SamanthaAnd #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Rashmika Sisters Roles Rangasthalam Vijay Sethupathi Vignesh Shivan Related Telugu News,Photos/Pics,Images..