టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న నటి రష్మిక మందన.ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్న నటి సమంత.వీరిద్దరూ అలవాట్లు ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి.చూడటానికి స్లిమ్ గా ఉన్న ఫిట్ నెస్ విషయంలో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు.అలాగే సమంత లాగే కమర్షియల్ సినిమాలతో రష్మిక స్టార్ హీరోయిన్ ఎదుగుతుంది.వీరిలో ఉన్న మరో మంచి లక్షణం సోషల్ సర్వీస్.
అలాగే తమని నమ్ముకున్న వాళ్లకి సాయం చేసే అలవాటు.ఈ అలవాటే ఇప్పుడు వీరిద్దరూ వెనకుండి ఒకే సినిమాకి ఫైనాన్స్ చేసేలా చేస్తుంది.
ఇండస్ట్రీలో హీరోయిన్లుకి అవకాశాలు తెచ్చిపెట్టడంలో మేనేజర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.దర్శక, నిర్మాతలు హీరోయిన్ డేట్స్ కోసం ముందుగా మేనేజర్లని సంప్రదిస్తారు.
వారు రెమ్యునరేషన్ మాట్లాడి డేట్స్ ఫిక్స్ చేస్తారు.తరువాత హీరోయిన్లు కథ వింటారు.
మేనేజర్లు కారణంగా హీరోయిన్లు పారితోషికం కూడా పెర్ఫెక్ట్ గా అందుకుంటారు.ఈ కారణంగానే కొంత మంది స్టార్ హీరోయిన్లు నమ్మకస్తులైన మేనేజర్లని పెట్టుకొని వారినే ఎక్కువ కాలం కొనసాగిస్తారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు అందాల భామలు వారి మేనేజర్లుని నిర్మాతలుగా మార్చేస్తున్నారు.సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ లో మూడో సినిమా తాజాగా లాంచ్ అయ్యింది.
ఈ సినిమాని మహేంద్రబాబు, కిరణ్ బాలవల్లి నిర్మిస్తున్నారు.ఈ ఇద్దరు చాలా మంది హీరోలు, హీరోయిన్లని మేనేజర్లుగా పని చేశారు.
ముఖ్యంగా సమంత, రష్మికకి వీళ్ళే మొదటి నుంచి మేనేజర్లుగా ఉన్నారు.ఇప్పుడు వీరిద్దరూ నిర్మాతలుగా పరిచయం అవుతున్న సినిమాకి ఈ స్టార్ హీరోయిన్లు ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
సినిమాకి కావాల్సిన బడ్జెట్ సమంత, రష్మిక సమకూర్చినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.