‘రంగస్థలం’ వాడేసుకుంటున్న సమంత.. మరోసారి ఎంత సక్కగున్నావే...

పెళ్లి తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు వరుసగా ఓకే చెబుతున్న సమంత తాజాగా కొరియన్‌ మూవీ ‘మిస్‌గ్రానీ’ రీమేక్‌కు సిద్దం అయిన విషయం తెల్సిందే.ఇప్పటికే అందుకు సంబంధించిన చిత్రీకరణ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.

 Samantha Rangasthalam Movie Title Using For Baby Movie-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రానికి ‘ఓ బేబి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.టైటిల్‌కు సబ్‌ టైటిల్‌ గా ఎంత సక్కగున్నావే.

అంటూ పెట్టారు.ఓ బేబి ఎంత సక్కగున్నావే అంటూ ఇటీవలే ఈ చిత్రం టైటిల్‌ను నిర్మాత సురేష్‌బాబు రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు రూపొంది మంచి లాభాలను దక్కించుకుంటున్నారు.చాలా విభిన్నమైన కథతో దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారని, త్వరలోనే రెండవ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుందని అంటున్నారు.

మొత్తానికి ఈ చిత్రం అందరి అంచనాలను అందుకోబోతుంది అంటున్నారు.

వచ్చే వేసవిలో సమంత ఓ బేబిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక రంగస్థలం తర్వాత సమంత తమిళంలో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది.ఆ రెండు సినిమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.

మరో వైపు నాగచైతన్యతో కలిసి మజిలి అనే చిత్రాన్ని ఈమె చేస్తున్న విషయం తెల్సిందే.సమంత ఈమద్య కాలంలో బిజీ బిజీగా గడిపేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube