మల్టీస్టారర్ మూవీ నుండి సామ్ ఔట్.. నిజమేనా?  

Samantha Quits Vijay Sethupathi Nayanthara Movie - Telugu Movie News, Nayanthara, Samantha, Vijay Sethupathi

స్టార్ బ్యూటీ సమంత ఇటీవల జాను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి తెలుగు రీమేక్‌గా జాను రావడంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.

Samantha Quits Vijay Sethupathi Nayanthara Movie

కానీ సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది ఈ సినిమా.దీంతో సమంత తెలుగులో మరో సినిమాను ఓకే చేయలేదు.

అయితే తమిళంలో మాత్రం ఈ బ్యూటీ రెండు సినిమాలను ఓకే చేసింది.తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల భామ నయనతారలతో కలిసి సమంత ఓ ట్రయాంగిల్ ‘లవ్ స్టోరి’ని ఓకే చేసింది.

మల్టీస్టారర్ మూవీ నుండి సామ్ ఔట్.. నిజమేనా-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు సమంత బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది.దీనికి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమే కారణమని తెలుస్తోంది.

సామ్ ఇటీవల ప్రెగ్నెంట్‌ అయ్యిందని, అందుకే ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ ఇదంతా కేవలం పుకారేనని, సమంత ఈ సినిమాలో నటిస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Quits Vijay Sethupathi Nayanthara Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test