పుష్పలో సమంతా ఐటెం సాంగ్.. పాడింది ఎవరో తెలుసా?

తెలుగు దర్శకులంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై లుక్కేశారు.ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా రేంజిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

 Samantha Pushpa Item Song Singer Details, Pushpa Item Song, Samantha, Allu Arju,-TeluguStop.com

రాజమౌళి త్రిఫుల్ ఆర్, పూరీ జగన్నాథ్ లైగర్ తెరకెక్కిస్తుండగా… సుకుమార్ పుష్ప సినిమాను రూపొందిస్తున్నాడు.ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతోంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఆయన ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు.అటు అల్లు అర్జున్​ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అటు ఈ సినిమాలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తుంది.

అటు సుమారు పుష్కర కాలం తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి ఈ సినిమాను చేస్తున్నారు.దీంతో జనాల్లో ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

ఈ నెల 17న ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ తో పాటు పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

Telugu Allu Arju, Anasuya, Fahadh Faasil, Pan India, Pushpa Item, Pushpa, Samant

అటు ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేస్తుంది.విడాకుల తర్వాత తన నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది.సమంత అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ అంటావా ఓ ఓ అంటావా అనే సాంగ్​ విడుదల కాబోతుంది.అయితే ఈ పాటతో ఓ కొత్త సింగర్ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతుంది.

Telugu Allu Arju, Anasuya, Fahadh Faasil, Pan India, Pushpa Item, Pushpa, Samant

తన పేరు ఇంద్రావతి. ఈమె మరెవరో కాదు.సింగర్ మంగ్లీ సిస్టర్.

ఈమె ఇప్పటికే పలు పాటలు పాడింది.జార్జిరెడ్డి సినిమాలో కూడా ఓ పాట పాడింది.

కానీ కొన్ని కారణాల మూలంగా బయటకు రాలేదు.ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో తన గొంతు వినిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube